తమన్నా ఐటమ్ సాంగ్ తో అదరగొట్టిన సూపర్ స్టార్ కూతురు  

Mahesh Babu Daughter Sitara Superb Dance on Dang Dang Song - Telugu Mahesh Babu Daughter Sitara, Sitara Superb Dance On Dang Dang Song, Telugu Viral News Updates, Viral In Social Media, సూపర్ స్టార్ కూతురు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు,,నమ్రతల ముద్దుల కూతురు సితార సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చాలా యాక్టివ్ గా ఉండే విషయం అందరికి తెలిసిందే.తండ్రి తో కలిసి సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తూనే ఉంటుంది.

Mahesh Babu Daughter Sitara Superb Dance On Dang Dang Song

ఇటీవల సితార,తన స్నేహితురాలు వంశీ పైడిపల్లి కూతురు ఆధ్య తో కలిసి యూట్యూబ్ లో ‘ఏ అండ్ ఎస్’ అనే ఛానల్ ను కూడా పెట్టారు.అయితే ఈ ఛానల్ లో ఇద్దరూ కలిసి రకరకాల వీడియోలు చేస్తూ తమ ఛానల్ లో అప్ లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

అయితే తాజాగా సితార తన తండ్రి తాజా సినిమా అయిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని తమన్నా ఐటమ్ సాంగ్ కి డ్యాన్స్ చేసి మరోసారి అభిమానులను అలరించింది.ఆ చిత్రంలో తమన్నా చేసిన డాంగ్ డాంగ్ సాంగ్‌కు సితార కూడా అదే స్టైల్ లో డాన్స్‌ చేసి ఇరగదీసింది.

అయితే ఆ పాటలో తమన్నా ధరించిన కాస్ట్యూమ్ స్టైల్‌లోనే సితార కూడా ధరించి మరి ఆ సాంగ్ కు డ్యాన్స్ వేసింది.అయితే ఈ వీడియోను నమ్రత సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం తో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

అదే వీడియోను తమన్నా కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.ప్రస్తుతం ఫ్యామిలీ తో లాంగ్ వెకేషన్ లో ఉన్న మహేష్ మే నుండి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం.ఈ సినిమా మాఫియా బ్యాక్ గ్రౌండ్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Daughter Sitara Superb Dance On Dang Dang Song Related Telugu News,Photos/Pics,Images..