తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో మంచి విజయం అందుకున్నటువంటి వారిలో నటుడు మహేష్ బాబు ( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి బాల నటుడుగా అడుగుపెట్టినటువంటి మహేష్ బాబు అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నారు.
ఇలా ఇండస్ట్రీలో ఎంత బిజీగా గడుపుతూ ఉన్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి( Rajamouli ) సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా మారిపోయారు.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది.
ఇక రాజమౌళి సినిమా అంటే దాదాపు రెండు మూడు సంవత్సరాలు రాజమౌళి ఆధీనంలోనే హీరోలు ఉండిపోవాల్సి వస్తుంది కానీ మహేష్ బాబు సంవత్సరానికి రెండు మూడుసార్లు వెకేషన్ వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.ఇకపై అలాంటివి కుదరవని స్పష్టంగా తెలుస్తుంది ఈ క్రమంలోనే రాజమౌళితో తన సినిమా స్టార్ట్ కాకుండానే ఈయన తన ఫ్యామిలీతో కలిసి స్విజర్లాండ్ వెకేషన్ వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.

ఇటీవల తన భార్య పిల్లలతో కలిసి స్విజర్లాండ్ వెకేషన్ వెళ్లినటువంటి మహేష్ బాబు ప్రస్తుతం అక్కడ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే నమ్రత( Namrata ) తన కుమార్తె సితార ( Sitara ) ఎప్పటికప్పుడు తమ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా సితార గౌతం ( Gautham ) కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.గడ్డకట్టే చలిలో, మంచు కురుస్తున్నటువంటి వేల వీరిద్దరూ ఆ చలిలోనే ఎంజాయ్ చేస్తూ దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇలా గడ్డకట్టే చలిలో ఈ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తూ బాగా చిల్లు అవుతున్నారని తెలుస్తుంది.ఇక ఇటీవల కాలంలో గౌతమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.ఇక సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇంత చిన్న వయసులోనే ఈమె హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారని చెప్పాలి.