పోలీసులను ఆశ్రయించిన మహేష్ సోదరి.. రూ.2.9 కోట్లు ఎగ్గొట్టారంటూ?

Mahesh Babu Sister Went To The Police Station Why Because

సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి, టాలీవుడ్ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని తాజాగా నార్సింగి పోలీసులను ఆశ్రయించారు.శిల్పా చౌదరి తన దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశారని ప్రియదర్శిని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.2.9 కోట్ల రూపాయలను తన దగ్గరి నుంచి శిల్పా చౌదరి తీసుకున్నారని ఆమె చెప్పుకొచ్చారు.ప్రతి వీకెండ్ డబ్బుల కోసం శిల్పా చౌదరి కిట్టీ పార్టీ ఏర్పాటు చేసేవారని ప్రియదర్శిని వెల్లడించారు.

 Mahesh Babu Sister Went To The Police Station Why Because-TeluguStop.com

ఎక్కువ వడ్డీ ఇప్పిస్తానని చెప్పి శిల్పా చౌదరి టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలను సైతం మోసం చేశారు.

దివ్యారెడ్డి అనే మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు విచారణలో ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి.రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరు చెప్పి శిల్పా చౌదరి చాలామందిని మోసం చేశారని పోలీసులు వెల్లడిస్తున్నారు.

 Mahesh Babu Sister Went To The Police Station Why Because-పోలీసులను ఆశ్రయించిన మహేష్ సోదరి.. రూ.2.9 కోట్లు ఎగ్గొట్టారంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ కేసు వెలుగులోకి వచ్చిన ఐదు రోజుల తర్వాత మహేష్ సోదరి ప్రియదర్శిని పోలీసులను ఆశ్రయించారు.

శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన వాళ్ల జాబితాలో మరి కొందరు సినీ ప్రముఖులు ఉన్నారని తెలుస్తోంది.

Telugu Crore Rupees, Kitty, Mahesh Sister, Complaint, Priyadarshini, Shilpa Chowdary, Srikrishna, Sudheer Babu, Tollywood-Movie

శిల్పా చౌదరి తాను సినీ నిర్మాతనని, టీవీ నిర్మాతనని పరిచయం చేసుకుని మొదట కిట్టీపార్టీలను ఏర్పాటు చేసి తర్వాత జూదశాలను కూడా ప్రారంభించారని సమాచారం.నిందితురాలు కోట్ల రూపాయలను ఏం చేశారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Telugu Crore Rupees, Kitty, Mahesh Sister, Complaint, Priyadarshini, Shilpa Chowdary, Srikrishna, Sudheer Babu, Tollywood-Movie

శిల్పా చౌదరి భర్త శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా శ్రీనివాస ప్రసాద్ ఎక్కడెక్కడ భూములు కొన్నాడో, ఏఏ ప్రాంతాలలో వెంచర్లు వేశాడో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.శిల్పా చౌదరి చేతిలో మోసపొయిన వాళ్లు ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.అధిక వడ్డీ పేరుతో ఆశ చూపేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.

#Complaint #Priyadarshini #Sudheer Babu #Shilpa Chowdary #Crore Rupees

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube