నెక్ట్స్ మూవీపై మహేష్ మౌనం ఎందుకో?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో సర్కారు వారి పాట ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

 Mahesh Babu Silent On Ssmb28-TeluguStop.com

ఇక ఈ సినిమాలో మహేష్ ఓ సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమా ఇంకా పూర్తిగాక ముందే మహేష్ తన నెక్ట్స్ మూవీని ఇటీవల అనౌన్స్ చేశారు.

 Mahesh Babu Silent On Ssmb28-నెక్ట్స్ మూవీపై మహేష్ మౌనం ఎందుకో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేష్ ఎప్పటినుండో ఓ సినిమా చేయాలని టాలీవుడ్ ప్రేక్షకులు కోరుతున్నారు.గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మాత్రం యావరేజ్ మూవీలుగా నిలిచాయి.దీంతో వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు.

కాగా ఈ కాంబోలో రాబోయే హ్యా్ట్రిక్ చిత్రం ఎలాంటి కథతో వస్తుందా, ఈ సినిమాలో మహేష్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.అయితే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ చాలా పకడ్బందీగా కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా గురించి చిత్ర యూనిట్, దర్శకుడు త్రివిక్రమ్ అఫీషియల్‌గా ట్వీట్ చేసినా, మహేష్ మాత్రం ఎలాంటి ట్వీట్ చేయలేదు.దీంతో ఈ సినిమాపై మహేష్ మౌనం దేనికో అని అందరూ ఆలోచిస్తున్నారు.

ఏదేమైనా త్రివిక్రమ్‌తో హ్యాట్రిక్ చిత్రం చేస్తున్న మహేష్, ఈ సినిమాతో ఎలాంటి బ్లాక్‌బస్టర్ అందుకుంటాడో చూడాలి.ఇక ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా ఎవరు చేస్తారనే విషయంపై ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

#Trivikram #Mahesh Babu #SSMB28

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు