సుకుమార్ లైన్ కి ఒకే చెప్పిన సూపర్ స్టార్ మహేష్ బాబు  

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాకి రెడీ అవుతున్నాడు.జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

TeluguStop.com -  Mahesh Babu Signs Film With Director Sukumar

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ చేయబోయే సినిమాల గురించి ప్రస్తుతం ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి.మహేష్ నెక్స్ట్ సినిమాలకి వచ్చేసరికి ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో మూవీ ఒకే చెప్పి ఉన్నాడు.

ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ సినిమాని జక్కన్న పట్టాలు ఎక్కించబోతున్నాడు.ఈ సినిమా స్టార్ట్ అయ్యే అయ్యేసరికి మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉంది.

TeluguStop.com - సుకుమార్ లైన్ కి ఒకే చెప్పిన సూపర్ స్టార్ మహేష్ బాబు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కూడా మహేష్ ఒకే చెప్పాడు.ఎన్ఠీఆర్ ప్రాజెక్ట్ తర్వాత త్రివిక్రమ్ మహేష్ సినిమాపై శ్రద్ధ పెడతాడు.

ఇది కూడా వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

ఇదిలా ఉంటే రీసెంట్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చెప్పిన స్టోరీకి మహేష్ ఒకే చెప్పాడని తెలుస్తుంది.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో నేనొక్కడినే అనే సినిమా వచ్చింది.హై స్టాండర్డ్స్ లో తెరకెక్కిన ఆ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు.

అయితే సుకుమార్ దాని తర్వాత మరల రంగస్థలం, నాన్నకు ప్రేమతో సినిమాలతో ట్రాక్ లోకి వచ్చి ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.

దీని తర్వాత విజయ్ దేవరకొండతో మరో పాన్ ఇండియా సినిమాని ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు.ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత మహేష్ సినిమాని స్టార్ట్ చేసే అవకాశం ఉంది.

ఈ నేపధ్యంలో ఇప్పుడు రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ లలో ఎవరు ముందుగా మహేష్ తో సినిమా చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

#Rajamouli #Mahesh Babu #Trivikram #Parasuram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు