అమ్మ విషయంలో మహేష్ సెంటిమెంట్ ఇదే.. దేవుడి ప్రసాదం అంటూ?

సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి మరణ వార్త అభిమానులను షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే.మహేష్ బాబు, సితార వెక్కివెక్కి ఏడుస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

 Mahesh Babu Sentiments About His Mother Details, Mahesh Babu, Mahesh Babu Mother-TeluguStop.com

తన ప్రతి సినిమా రిలీజ్ కు ముందు మహేష్ బాబు తల్లి చేతి కాఫీ తాగడంతో పాటు తల్లి ఆశీర్వాదాలు తీసుకునేవారు.ఇలా చేయడాన్ని మహేష్ బాబు సెంటిమెంట్ గా భావించేవారు.

మహేష్ బాబు పలు ఈవెంట్లలో, ఇంటర్వ్యూలలో తల్లి గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అమ్మ అంటే నాకు దేవుడితో సమానం అని మహేష్ బాబు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

అమ్మ చేతి కాఫీ నాకు గుడిలో దేవుడి ప్రసాదంలా ఉంటుందని మహేష్ బాబు కామెంట్లు చేశారు.అమ్మ ఆశీస్సులు నాకు చాలా ముఖ్యమని మహర్షి సినిమా ఈవెంట్ సమయంలో మహేష్ బాబు కామెంట్లు చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తల్లి గురించి ఏం మాట్లాడినా మహేష్ చాలా ఎమోషనల్ అవుతారని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు.

మహేష్ బాబు తల్లి మరణవార్త తెలిసి గుండె తరుక్కుపోతుందని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Indira Devi, Krishna, Mahesh Babu, Mother-Movie

కృష్ణ కుటుంబంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూ ఉండటంతో అభిమానులు మరింత ఎక్కువగా ఫీలవుతున్నారు.కృష్ణ, మహేష్ కుటుంబాలకు ఏంటీ శాపం అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Indira Devi, Krishna, Mahesh Babu, Mother-Movie

కృష్ణ కుటుంబీకులు కొన్ని నెలల గ్యాప్ లోనే మృతి చెందడం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది.కృష్ణ రెండో భార్య విజయనిర్మల 2019 సంవత్సరం జూన్ 27వ తేదీన మృతి చెందారు.కృష్ణ ఆ షాక్ నుంచి కోలుకోక ముందే కృష్ణగారి పెద్దబ్బాయి రమేష్ బాబు మృతి చెందారు.ఇప్పుడు కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి సైతం కన్నుమూయడం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube