జీఎస్టీ ఎఫెక్ట్ : లీగల్ నోటీసులు ఇచ్చిన మహేష్ బాబు  

Mahesh Babu Send Legal Notice To Gst Commissioner-

జీఎస్టీ టాక్స్ ఎగ్గొట్టారంటూ సినీ హీరో మహేష్ బాబు బ్యాంక్ ఖాతాలు జీఎస్టీ కమిషనర్ ఫ్రీజ్ చేయడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అయితే ఈ వ్యవహారం ఇక్కడితో ఆగలేదు.తిరిగి మహేష్ బాబు కూడా… జీఎస్టీ కమిషనర్ కు లీగల్ నోటీసులు ఇచ్చారు.ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా ఖాతాలను స్తంభింపజేయడంపై ఆయన ఈ నోటీసులు జారీ చేశారు.

Mahesh Babu Send Legal Notice To Gst Commissioner- Telugu Viral News Mahesh Babu Send Legal Notice To Gst Commissioner--Mahesh Babu Send Legal Notice To Gst Commissioner-

తాను అన్నిరకాల పన్నులు సక్రమంగా చెల్లించానని మహేష్ బాబు స్పష్టంచేశారు.కోర్టు పరిధిలో ఉన్న బ్యాంక్ ఖాతాలను ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేయడం సరి కాదని ఆయన అన్నారు.

తాను చట్టానికి కట్టుబడి ఉండే పౌరుడినని మహేష్ చెబుకున్నారు.

హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ కోర్టు పరిధిలో ఉన్న 18 లక్షల 50 వేల రూపాయల పన్నును వడ్డీతో కలిపి 73 లక్షల 50 వేలుగా నిర్ణయించి బ్యాంక్ ఖాతాల నిలుపుదలకు ఆదేశించారని.

వాస్తవానికి 2007 -08 ఆర్థిక సంవత్సరానికి గాను అంబాసిడర్ సేవలు ఎటువంటి పన్ను పరిధిలోకి రాదని ఆయన స్పష్టం చేశారు.అంబాసిడర్ సేవలను పన్ను పరిధిలోకి సెక్షన్ 65 (105) (జెడ్ జెడ్ జెడ్ జెడ్ క్యూ) ద్వారా 2010 జులై 1వ తేదీ నుంచి చేర్చారని, పన్ను చెల్లింపుదారుడు చట్టపరమైన అన్ని నియమాలకు లోబడే ఉన్నా, ఎటువంటి నోటీసు లేకుండా, పైగా ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ జీఎస్టీ కమిషనరేట్ బ్యాంకు ఖాతాల నిలుపుదలకు ఆదేశించిందని మహేష్ బాబు లీగల్ టీమ్ వెల్లడించింది.

.

తాజా వార్తలు