నైజాం నవాబ్‌గా మహేష్‌.. సరిలేరు నీకెవ్వరు అంటోన్న ఫ్యాన్స్  

Mahesh Babu Scores Back To Back 30 Crore Movie In Nizam-mahesh Babu,nizam,sarileru Neekevvaru,telugu Movie News

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు రిలీజ్ అయ్యి వారం దాటినా సినిమాకు రెస్పాన్స్ మాత్రం తగ్గడం లేదు.పండగ సెలవులు ముగియడంతో ఈ సినిమాకు అసలు పరీక్ష సోమవారం నుండి ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Mahesh Babu Scores Back To 30 Crore Movie In Nizam-Mahesh Nizam Sarileru Neekevvaru Telugu News

అయినా ఇప్పటికే ఈ సినిమా పలు కొత్త రికార్డులను క్రియేట్ చేసి మహేష్ స్టామినా ఏమిటో ఇండస్ట్రీకి మరోసారి రుజువు చేసింది.

ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది.

ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.ఈ సినిమా ఇప్పటివరకు ఒక్క నైజాం ఏరియాలోనే రూ.32.1 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు సాధించింది.ఈ సినిమాతో మహేష్ వరుసగా రెండోసారి ఈ ఫీట్ సాధించిన హీరోగా తన సత్తా చాటాడు.గత చత్రం మహర్షితో రూ.30 కోట్ల హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టిన మహేష్, ఈ సినిమాతో దాన్ని అధిగమించాడు.

కాగా ఈ సినిమా టోటల్ రన్‌లో రూ.35 కోట్ల వసూళ్లు సాధిస్తుందని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది.అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కగా ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటించగా, అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది.

తాజా వార్తలు

Mahesh Babu Scores Back To Back 30 Crore Movie In Nizam-mahesh Babu,nizam,sarileru Neekevvaru,telugu Movie News Related....