టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాలలో ఎంతోమందికి సహాయం చేసే సన్నివేశాలను మనం తరచూ చూస్తూ ఉంటాం.మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాలో గ్రామాలను దత్తత తీసుకొని వారిని అభివృద్ధి చేసే సన్నివేశాలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు.
అయితే ఈ సినిమా తరువాత మహేష్ బాబు రెండు గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ రెండు గ్రామ అభివృద్ధి పనులు అన్నింటిని తన సతీమణి నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నారు.మహేష్ బాబు రీల్ లైఫ్ లో మాత్రమే కాకుండా, రియల్ లైఫ్ లో కూడా ఎంతో సేవా గుణం కలిగిన వ్యక్తి అని పలుమార్లు నిరూపించుకున్నాడు.పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతో మందికి అండగా నిలిచి నిజంగానే సూపర్ స్టార్ అనిపించుకున్నారు.
వివిధ రకాల గుండె జబ్బులతో బాధపడుతున్న ఎంతోమంది చిన్నారులకు ఆపరేషన్ చేయించి వారికి పునర్జన్మ కల్పించారు.
ఈ తరహాలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన డింపుల్ అనే మరొక చిన్నారిని ఆపద సమయంలో ఆదుకుని మహేష్ బాబు మరొకసారి తన మానవతా హృదయాన్ని తెలియజేశాడు.డింపుల్ అనే ఈ చిన్నారి కాల్సిఫైడ్ పల్మనరీ వాల్వ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది.అయితే ఈ చిన్నారి వైద్య ఖర్చులన్ని మహేష్ బాబు భరిస్తూ తనకు మెరుగైన వైద్యం చేయించారు.
అయితే ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితి ఎంతో బాగుందని… పాపకు వారి కుటుంబ సభ్యులకు మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలిపారు.సినిమాల విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి నుంచి కంటిన్యూ షూటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం.ఈ సినిమాలో మహేష్ బాబుతో మహానటి కీర్తి సురేష్ జత కట్టనున్నారు.