99 మంది చిన్నారులకి ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించిన మహేష్ బాబు   Mahesh Babu Saves 99 Poor Children Lives     2017-11-06   01:56:16  IST  Raghu V

ఈ ఫోటోలో మహేష్ బాబు ఫోటో పట్టుకోని కనిపిస్తున్న పసివాడికి మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. అందులో కొత్తేముంది, మహేష్ బాబు అంటే సూపర్ స్టార్. తనకి చాలామంది చిన్నారులు అభిమానులు అనుకోకండి. మిగితావారి అభిమానం వేరు ఇతని అభిమానం వేరు. ఇతనిది కేవలం అభిమానం కాదు, అంతకు మించిన కృతజ్ఞత. ఈ బాలుడు మహేష్ బాబు వలన ప్రాణాలు కాపాడుకున్న 99 చిన్నారల్లో ఒకడు.

మహేష్ బాబు సంపాదనలో 30% సేవా కార్యక్రమాలకే వెళతాయి అని తెలుగుస్టాప్ ఇప్పటికే రిపోర్ట్ చేసింది. Heal a child ఫౌండేషన్ తో జతకట్టిన సూపర్ స్టార్, ఎంతోమంది చిన్నారులకు తన డబ్బుతో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాడు. మహేష్ బాబు దత్తత తీసుకున్న రెండు గ్రామాల్లో కూడా మహేష్ బాబు హెల్త్ కార్డ్ అందిస్తున్న మహేష్, వారికి కూడా ఉచిత వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నాడు.

ఇక ఈమధ్యకాలంలో నిర్వహించిన హెల్త్ క్యాంపుల్లో 99 పేద చిన్నారులకి గుండెజబ్బు ఉన్న విషయం తెలిసింది మహేష్ కి. మరో మాట అనుకోకుండా వెంటనే పనులు మొదలుపెట్టించాడు. 99 మంది చిన్నారుల ప్రాణాల కాపాడాడు. మహేష్ బాబు చేసే సేవా కార్యక్రమాలల్లో ఇది పావు శాతం కాకపోవచ్చు, కాని ఆ 99 గుండెలు కొట్టుకున్నంత కాలం, ఆ గుండెల్లో ఉండిపోతాడు సూపర్ స్టార్.

సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం భరత్ అనే నేను షూటింగ్ లో‌ బీజీగా ఉన్న మహేష్, ఆ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు. ఆ తరువాత త్రివిక్రమ్, రాజమౌళి బోయపాటి శ్రీనులతో, ఇదే వరుసలో‌ సినిమాలు ఉంటాయని తెలుస్తోంది.