కీర్తి పాపకు మహేష్ పంచులే పంచులు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్ర షూటింగ్‌లో యమ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

 Mahesh Babu Sattires On Keerthy Suresh In Svp, Mahesh Babu, Keerthy Suresh, Sark-TeluguStop.com

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, బ్లాస్టర్ టీజర్ ఇటీవల రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నాయి.కాగా ఈ సినిమాలో మహేష్ సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాలో మహేష్ కంపెనీలో కీర్తి సురేష్ ఓ ఉద్యోగినిగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే సంప్రదాయమైన అమ్మాయిగా దైవభక్తితో పాటు నమ్మకాలు ఎక్కువగా పెట్టుకున్న అమ్మాయిగా కీర్తి పాత్రను దర్శకుడు తీర్చిదిద్దాడట.దీంతో ఈ సినిమాలో మహేష్ ఏదైనా పని చేసేందుకు వెళ్తుంటే ఆమె ఎదురొచ్చి అతడికి మంచి జరగాలని కోరుతుంటాడట.

ఇది చూసిన మహేష్ ఆమెపై ఫన్నీ సెటైర్లు విసురుతూ ఉంటాడట.ఇదంతా సినిమాలో మంచి కామెడీని పండిస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది.

మొత్తానికి కీర్తి సురేష్‌పై మహేష్ బాబు పంచులు మామూలుగా ఉండబోవని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు థమన్ అద్భుతమైన సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండేలా చిత్ర యూనిట్ చూసుకుంటోంది.

ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.మరి సంక్రాంతి బరిలో మహేష్ సర్కారు వారి పాట ఎంత పలుకుతుందో తెలియాలంటే వచ్చే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube