'సర్కారు వారి పాట' అసలేం జరుగుతోంది?

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్‌ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

 Mahesh Babu Sarakaruvari Pata Latest Update,  Mahesh Babu, Sarkaru Vari Pata, Pa-TeluguStop.com

గత ఏడాదిలోనే ఆ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది.అంటే ఈ ఏడాదిలో సినిమా కోసం ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా మహేష్‌బాబు కెమెరా ముందుకు రాలేదు.2020 సంవత్సరం ముగింపుకు వచ్చేస్తోంది.కరోనా కారణంగా ఇన్ని రోజులు షూటింగ్‌ చేయలేదు.

మరి ఇప్పుడు అయినా షూటింగ్‌కు మహేష్‌బాబు వెళ్తాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇండియాలో కరోనా కేసులు ఇంకా విపరీతంగా ఉన్నప్పటికి చాలా సినిమాలకు సంబంధించిన చిత్రీకరణ మొదలు అయ్యింది.

అలాగే ఈ సినిమాకు కూడా షూటింగ్‌ మొదలు పెడితే బాగుంటుందని కొందరు భావిస్తున్నారు.కాని మహేష్‌బాబు మాత్రం కాస్త వెనుకాడుతున్నారు.

ఈ ఏడాది చివరి వరకు లేదా వచ్చే ఏడాది వరకు వెయిట్‌ చేస్తే పోయేది ఏముంది అంటున్నాడట.సినిమాను ఆలస్యంగా మొదలు పెట్టినా కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమాను పూర్తి చేద్దాం అంటూ దర్శక నిర్మాతలకు చెబుతున్నారట.

సినిమాను అమెరికాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది.ఆ సీన్స్‌ విషయంలో ఇటీవలే అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.అమెరికాలో షూటింగ్‌ చేయబోతున్నాం అంటూ మహేష్‌బాబుతో పాటు టీం అంతా ప్రకటించారు.అయితే అమెరికాలో షూటింగ్‌ అంటే వ్యాక్సిన్‌ వచ్చే వరకు వెయిటింగ్‌ తప్పదేమో అనిపిస్తుంది.

వచ్చే ఏడాదిలో మొదటి రెండు మూడు నెలలు ఇక్కడ షూటింగ్‌ చేసి మిగిలిన షూటింగ్‌ను అమెరికాలో వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube