బాలయ్యను అందుకోలేక పోయిన మహేష్‌.. 40M తో నెం.4

బాలయ్యను అందుకోలేక పోయిన మహేష్‌.. 40M తో నెం.4

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా టీజర్‌ ఏకంగా 57 మిలియన్ ల వ్యూస్ ను యూట్యూబ్‌ లో దక్కించుకుంది.అంతకంటే ఎక్కువగా పుష్ప సినిమా టీజర్ 87 మిలియన్ ల వ్యూస్ ను మరియు రాధే శ్యామ్‌ సినిమా టీజర్ 63 మిలియన్ లవ్యూస్ ను దక్కించుకున్నాయి.

 బాలయ్యను అందుకోలేక పోయిన మహేష్‌.. 40m తో నెం.4-TeluguStop.com

నాల్గవ స్థానంలో సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సర్కారు వారి పాట టీజర్ నిలిచింది.బ్లాక్ బస్టర్ అంటూ విడుదల అయిన సర్కారు వారి పాట టీజర్ కు తాజాగా 40 మిలియన్‌ ల వ్యూస్ దక్కాయి.1.1 మిలియన్ ల యూట్యూబ్‌ లైక్స్ వచ్చాయి.సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్‌ టీజర్ కు కేవలం 40 మిలియన్ ల వ్యూస్ రావడం అభిమానులకు కాస్త నిరుత్సాహం కలిగించే విషయం అనడంలో సందేహం లేదు.అయినా కూడా తాజగా 40 మిలియన్ లు చేరువ అయిన నేపథ్యం లో #SVPBlasterHits40M అనే హ్యాష్ ట్యాగ్‌ తో అభిమానులు తెగ సంబుర పడుతున్నట్లుగా ట్వీట్స్ చేస్తున్నారు.

Telugu Akhanda Teaser, Balakrishna, Mahesh Babu, Sarkaru Vaari Pata Teaser-Movie

మహేష్‌ బాబు ఈ టీజర్‌ నెం.4 లోనే ఉండాల్సిందే.ఎందుకంటే అఖండ సినిమా టీజర్‌ వ్యూస్‌ 17 మిలియన్‌ లు ఎక్కువగా ఉన్నాయి.ఈ సమయంలో అంతటి వ్యూస్ ను దక్కించుకోవడం అంటూ నూరు కాదు రెండు వందల శాతం అసాధ్యం.అందుకే మహేష్ బాబు టీజర్ రికార్డు విషయంలో నెం.4 లో ఉండాల్సిందే.తన తదుపరి సినిమా తో ఆ రికార్డును బ్రేక్‌ చేయాల్సి ఉంటుంది.పుష్ప మరియు రాధే శ్యామ్‌ లు చెరపలేని రికార్డును నమోదు చేశారు.ఖచ్చితంగా అంతటి భారీ వ్యూస్ ను దక్కించుకోవాలంటే ఖచ్చితంగా ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా టీజర్ రావాల్సిందే.అన్ని భాషలకు కలిపి ఒకే టీజర్ ను జక్కన్న విడుదల చేస్తే ఖచ్చితంగా ఆ టీజర్ వంద మిలియన్‌ ల వ్యూస్ ను దక్కించుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 బాలయ్యను అందుకోలేక పోయిన మహేష్‌.. 40M తో నెం.4-బాలయ్యను అందుకోలేక పోయిన మహేష్‌.. 40M తో నెం.4-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మహేష్‌ బాబు తదుపరి సినిమా వచ్చే వరకు బాలయ్య తదుపరి స్థానంతో బాబు అభిమానులు సరి పెట్టుకోవాల్సిందే.

#SarkaruVaari #Balakrishna #Akhanda Teaser #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube