సర్కారు వారి పాట ఒక ప్రయోగం అనుకుంటున్న మహేష్‌  

mahesh babu sarkaru vaari pata movie story is very unique Mahesh Babu, Sarileru Nikevvaru,Sarkaru Vari Pata, Parushuram, Banking Deportment, Hyderabad And America Movie Shooting, - Telugu Keerthi Suresh, Mahesh Babu, Parasuram, Sakaru Vaari Pata, Sarileru Neekevvaru, Telugu Film News

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో తదుపరి సినిమాలు ప్రయోగాత్మకంగా చేసేందుకు సిద్ధమయ్యాడు.ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించని గెటప్ లో ఎన్నడూ నటించని కథలో మహేష్ బాబు కనిపించబోతున్నట్లు గా తెలుస్తోంది.

TeluguStop.com - Mahesh Babu Sarkaru Vaari Pata Movie Story Is Very Unique

పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు సరికొత్తగా కనిపించబోతున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

ఇలాంటి కథను టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ హీరో కూడా ట్రై చేయలేదని బాలీవుడ్ లో కూడా ఇది ఖచ్చితంగా మంచి ఆదరణ దక్కించుకుంటుందనే నమ్మకాన్ని యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

TeluguStop.com - సర్కారు వారి పాట ఒక ప్రయోగం అనుకుంటున్న మహేష్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కథ నచ్చడం వల్లే దర్శకుడు పరశురామ్ కు అంతగా ట్రాక్ రికార్డు లేకున్నా కూడా ఈ సినిమా బాధ్యతలను ఆయనకు మహేష్‌ అప్పగించారు.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.

బ్యాంకింగ్ రంగంలో ఉన్న అవినీతి మరియు ఇతరత్ర లొసుగులను ఈ సినిమాలో చూపించబోతున్నారు.

అంత సరిగా ఉంటే ఈ పాటికి సినిమా షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేవారు.

కానీ కరోనా కారణం షూటింగ్ ఆలస్యం అవుతుంది ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ ను ప్రారంభించి వచ్చే ఏడాది చివరి వరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా దర్శకుడు పరశురామ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను హైదరాబాద్ తో పాటు అమెరికాలో షూటింగ్ జరిపేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ ఇప్పటికే మొదలైంది.

ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.అయితే ఆ విషయమై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

త్వరలోనే ఆ విషయంలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది

.

#Keerthi Suresh #Parasuram #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Sarkaru Vaari Pata Movie Story Is Very Unique Related Telugu News,Photos/Pics,Images..