సర్కారు వారి పాటలో ఆ యాక్షన్‌ సన్నివేశం ప్రత్యేకమట

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లోని ప్రతి సన్నివేశం కూడా అంచనాలను మించి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

 Mahesh Babu Sarkaru Vaari Pata Movie Shooting Update-TeluguStop.com

గీత గోవిందం సినిమా తో దర్శకుడిగా సక్సెస్ ను దక్కించుకున్న పరశురామ్‌ కాస్త ఆలస్యం అయినా మంచి సినిమా తో రాబోతున్నాడు.పరశు రామ్‌ బ్యాంకింగ్‌ రంగంలో ఉన్న అవినీతి మరియు లూప్‌ హోల్స్ గురించిన విషయాలను ఈ సినిమా లో చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

రికార్డు స్థాయి బడ్జెట్‌ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.ఇక ఈ సినిమా లోని కార్ల ఛేజింగ్ సన్నివేశం సినిమా కు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని దర్శకుడు పరశురామ్‌ చెబుతున్నాడు.

 Mahesh Babu Sarkaru Vaari Pata Movie Shooting Update-సర్కారు వారి పాటలో ఆ యాక్షన్‌ సన్నివేశం ప్రత్యేకమట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విశ్వస నీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పాటు ఫార్ములా వన్ రేసర్లను ఉపయోగించి కార్‌ చేజింగ్‌ సన్నివేశాలను చిత్రీకరించ బోతున్నట్లుగా చెబుతున్నారు.అందుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.

కీర్తి సురేష్‌ హీరోయిన్‌ గా రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.మహేష్‌ బాబు తో ఒక రొమాంటిక్ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా ను పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం తగ్గిన తర్వాత హైదరాబాద్‌ లో ప్రత్యేకంగా వేసిన సెట్‌ లో చిత్రీకరణ చేపట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

వరుసగా సినిమాలు చేస్తున్న మహేష్‌ బాబు ఈ సినిమా తో మరో ఇండస్ట్రీ హిట్‌ ను దక్కించుకోవడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకం తో చెబుతున్నారు.

#Geetha Govindam #Parashu Ram #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు