సర్కారు వారి పాట సందడి మొదలయ్యింది  

mahesh babu sarkaru vaari pata movie shooting update , mahesh babu, sarkaru vaari pata, sarkaru vaari pata movis hooting, parasuram, lockdown - Telugu Keerhi Suresh, Mahesh Babu, Parasu Ram, Sarkaru Vaari Pata, Telugu Film News

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి.కరోనా కారణంగా ఇన్నాళ్లు ఆలస్యం చేసిన యూనిట్ సభ్యులు నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

TeluguStop.com - Mahesh Babu Sarkaru Vaari Pata Movie Shooting Started

ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను అమెరికాలో చిత్రీకరించబోతున్నట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.అందుకు సంబంధించిన లొకేషన్లను వెతికేందుకు దర్శకుడు పరశురామ్ తో పాటు సినిమాటోగ్రాఫర్ మరియు ఆర్ట్ డైరెక్టర్ నిన్న రాత్రి అమెరికాకు వెళ్లారు.

అక్కడ వాళ్ళు వారం నుండి పది రోజుల పాటు అనేక ప్రాంతాల్లో పర్యటించి సినిమాకు సూట్‌ అయ్యే లొకేషన్లను పట్టనున్నారు.సినిమా కథలో కీలక భాగం అమెరికాలో జరుగుతుంది.

TeluguStop.com - సర్కారు వారి పాట సందడి మొదలయ్యింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కనుక దాదాపు నెల రోజుల పాటు అక్కడ షూటింగ్ జరిగే అవకాశం ఉందట.అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇప్పుడే డైరెక్టర్ చేయనున్నారు.

సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా రెడీ అవుతున్నట్లు గా ఇప్పటికే విడుదలైన ఫ్రీ లుక్ పోస్టర్ తో తెలుస్తుంది.ఈ ఏడాది ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు కు ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సినిమాపై ఉన్న అంచనాలు నేపథ్యంలో దర్శకుడు పరుశురాం ఈ సినిమాను చాలా పకడ్బందీగా తెరకెక్కించేందుకు స్క్రిప్టు రెడీ చేశాడు.ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడిగా కీర్తి సురేష్ నటించబోతున్నట్లు గా తెలుస్తోంది.

తమిళ స్టార్ నటుడు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు వచ్చాయి.ఆ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు.తమన్ సంగీతాన్ని అందించనున్నాడు.సినిమాను నవంబర్ నుండి ప్రారంభించి వచ్చే ఏడాది జూన్ జూలై వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఆగస్టు లో లేదా దసరాకు సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని యూనిట్ సభ్యులు అంటున్నారు.

#Parasu Ram #Keerhi Suresh #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Sarkaru Vaari Pata Movie Shooting Started Related Telugu News,Photos/Pics,Images..