పవన్‌ మూవీ సంక్రాంతి రిలీజ్ వార్తలపై టీమ్ క్లారిటీ.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్‌

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం నాలుగు సినిమాలను చేస్తున్నాడు.అందులో వకీల్ సాబ్‌ ముగించి విడుదలకు సిద్దం చేశాడు.

 Mahesh Babu Sarkaru Vaari Pata Movie And Pawan Krish Movie Not At Same Date-TeluguStop.com

ఆ సినిమా విడుదల తేదీ వచ్చేసింది.ఇక అయ్యప్పనుమ్‌ కోషియుమ్ రీమేక్ మరియు క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ల రిలీజ్ డేట్‌ లపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ రెండు సినిమాల్లో ఏది ముందు ఏది తర్వాత అనే విషయమై స్పష్టత రావడం లేదు.నెంబరింగ్ ప్రకారం అయితే వకీల్ సాబ్‌ ను పవన్ 26 అంటూ ప్రచారం చేస్తుండగా క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను పవన్‌ 27 అంటూ ప్రచారం చేస్తున్నారు.

 Mahesh Babu Sarkaru Vaari Pata Movie And Pawan Krish Movie Not At Same Date-పవన్‌ మూవీ సంక్రాంతి రిలీజ్ వార్తలపై టీమ్ క్లారిటీ.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంటే వకీల్‌ సాబ్‌ తరవ్ఆత పవన్ క్రిష్‌ ల కాంబో మూవీ రావాల్సి ఉంది.ఇక అయ్యప్పనుమ్‌ రీమేక్ ను కూడా ఇదే ఏడాదిలో విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.

అంటే వకీల్ సాబ్ తో పాటు ఆ రెండు సినిమాలు కూడా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ ముందు వచ్చినట్లయితే క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది.

కాని ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ రాలేదు.అయినా కూడా సోషల్‌ మీడియా మరియు వెబ్‌ మీడియాల్లో మహేష్‌ బాబు సర్కారు వారి పాట క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ చేస్తున్న సినిమాలు క్లాష్‌ అవ్వబోతున్నాయి.

సంక్రాంతికి తప్పకుండా వీరి సినిమాలు అభిమానుల ముందుకు రాబోతున్నాయి అంటూ వాదిస్తున్నారు.ఈ సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు పవన్‌ సన్నిహితులు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా విషయమై ఇప్పటి వరకు అసలు విడుదల తేదీ గురించి కనీసం చర్చించలేదు.

ఒక వేళ వచ్చినా కూడా ఈ ఏడాదిలోనే వీరి కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారని చెప్పారు.దాంతో సంక్రాంతికి మహేష్‌ పవన్ ల మద్య పోటీ లేదని అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఈ ఏడాదిలోనే వచ్చే అవకాశం ఉంది అనడంలో ఫ్యాన్స్ మరింత ఆనందంగా ఉన్నారు.

#HaraHara #Krish #PawanHara #PawanNew #MaheshBabu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు