కాదు కాదు అంటూనే ఆమెనే కన్ఫర్మ్‌ చేసిన మహేష్‌బాబు -Telugu Tollywood Movie Actor Hero Profile & Biography  

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా హీరోయిన్ కు సంబంధించిన విషయమై క్లారిటీ వచ్చేసింది.కొన్ని నెలల క్రితం కీర్తి సురేష్ తాను త్వరలో మహేష్ బాబుతో కలిసి ఒక సినిమాలో నటించబోతున్నట్లు గా లైవ్ చాట్ లో చెప్పింది.ఆ సమయంలో అంతా కూడా మహేష్ కి సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ నటించబోతున్నట్లు గా భావించారు.కానీ చిత్ర నిర్మాతలు మాత్రం ఇంకా హీరోయిన్ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదని హీరోయిన్‌ కీర్తి సురేష్ అంటూ వస్తున్న వార్తలను ఖండించారు.నిర్మాతలు హీరోయిన్ విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో కీర్తి సురేష్ కాకుండా మరెవరైనా నటిస్తారేమో చూడాలని ప్రేక్షకులు ఎదురు చూశారు.మహేష్ బాబుకు జోడీగా కీర్తిసురేష్‌ అయితే బాగోదేమో అని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ నేపథ్యంలోనే.కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెనే ఫైనల్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.నేడు స్వయంగా మహేష్ బాబు ట్విట్టర్ లో ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సర్కారు వారి పాట టీంలో కి స్వాగతం పలికారు.ఈ చిత్ర నిర్మాతలు కూడా అప్పుడు కాదు అని ఇప్పుడు ఆమెను హీరోయిన్ గా ప్రకటించారు.

హీరోయిన్ కీర్తి సురేష్ కాదు కాదు అని ఇప్పుడు ఆమెను హీరోయిన్ గా ప్రకటించారు.ఇక ఈ సినిమా షూటింగ్ ని వచ్చే నెల నుండి అమెరికాలో నిర్వహించబోతున్నారు.దాదాపు నెలన్నర రోజుల పాటు అక్కడ చిత్రీకరిస్తారని ఇప్పటికే చిత్ర యూనిట్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
మొదటి షెడ్యూల్లో కీర్తి సురేష్ పాల్గొనక పోవచ్చు అంటూ సమాచారం అందుతోంది.చిత్ర యూనిట్ సభ్యులు అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆమె షూటింగ్‌ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇక ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఈ ఎడాది అల వైకుంఠపురంలో సినిమా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తమన్‌ మహేష్ బాబు కి మరో సూపర్ హిట్ ని అందిస్తాడని అంత నమ్మకం గా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు కీర్తి సురేష్ జంట కోసం ప్రేక్షకులు ఇప్పటి నుండే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.
మహేష్‌ బాబు బర్త్‌ డే విషెష్‌ మరియు సర్కారు వారి పాట మూవీలోకి వెల్కంకు కీర్తి సురేష్‌ స్పందించింది.మీతో వర్క్‌ చేసేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

థ్యాంకూ అంటూ ట్వీట్‌ చేసింది.

#Birthday #Keerthi Suresh #Thaman #Mahesh Babu #@urstrulyMahesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Mahesh Babu Sarkaru Vaari Pata Heroine Keethi Suresh Related Telugu News,Photos/Pics,Images..