అందమైన లొకేషన్ లో పాటల షూటింగ్ జరుపుకుంటున్న 'సర్కారు'!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’.ఈ సినిమా ప్రెసెంట్ షూటింగ్ జరుపు కుంటుంది.

 Mahesh Babu Sarkaru Vaari Paata Movie Latest Update-TeluguStop.com

ఇప్పటికే విడుదల అయినా పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసాయి.ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో మహేష్ లుక్ కూడా పూర్తిగా మార్చేశాడు.ఇంతకు ముందు కంటే మరింత యంగ్ గా ఈ సినిమాలో కనిపిస్తునందు.

 Mahesh Babu Sarkaru Vaari Paata Movie Latest Update-అందమైన లొకేషన్ లో పాటల షూటింగ్ జరుపుకుంటున్న సర్కారు’-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక కీర్తి కూడా మరింత గ్లామర్ గా ఈ సినిమాలో కనిపిస్తుంది.ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ప్రెసెంట్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుండి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒక అప్డేట్ అందించారు.

ప్రెసెంట్ సర్కారు వారి పాట షూటింగ్ స్పెయిన్ లో జరుపు కుంటుంది.

థమన్ ట్విట్టర్ వేదికగా ఈ సినిమా అప్డేట్ ను అభిమానులకు అందించి ఖుషీ చేసాడు.తాజాగా థమన్ ట్విట్టర్ లో ఒక ఫోటో షేర్ చేసాడు.

ఆ పిక్ లో థమన్ తో పాటు డైరెక్టర్ పరశురామ్, నిర్మాత రవి, సినిమాటోగ్రాఫర్ మాదీ ఉన్నారు.ఈ పిక్ తో పాటు థమన్ కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు.

ప్రెసెంట్ స్పెయిన్ లో సర్కారు వారి పాట టీమ్ పాటలను షూట్ చేస్తున్నట్టు థమన్ తెలిపారు.” స్పెయిన్ లోని బార్సిలోనా లో పాటల షూటింగ్ అందమైన లొకేషన్స్ లో ఉత్సాహంగా జరుగుతుందని.సూపర్ స్టార్ మహేష్ ఎనర్జీ చూడడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని” థమన్ తెలిపారు.ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరి ఈ సినిమా విడుదల అయినా తర్వాత ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

https://twitter.com/MusicThaman/status/1449762797437526017?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1449762797437526017%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fntvtelugu.com%2Fsarkaru-vaari-paata-movie-shooting-latest-update%2F
#SarkaruVaari #Keerthy Suresh #Mahesh Babu #SarkaruVaari #Thaman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube