వామ్మో.. మహేష్ మూవీపై వడ్డీ భారం అన్ని కోట్లా.. పది కోట్లకు ఎంత కట్టారంటే?

మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట నేడు థియేటర్లలో విడుదలైంది.వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో జోరుమీదున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు సర్కారు వారి పాట ఫలితం ఒకింత షాకిచ్చిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 Mahesh Babu Sarkaru Vaari Paata Interest Pressure Details Here Goes Viral , Mahesh Babu , Interest Burden Ranges Rs 30 Crore To Rs 40 Crore , Sarkaru Vaari Paata , Corona Second Wave, Burden Of Interest, Third Wave , Shocking Details , Mytri Producers-TeluguStop.com

తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో సర్కారు వారి పాట బెనిఫిట్ షోలు ప్రదర్శితం కాగా బెనిఫిట్ షోలకు బుకింగ్స్ ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో జరగలేదని బోగట్టా.

సర్కారు వారి పాట సినిమా వల్ల మైత్రీ నిర్మాతలపై వడ్డీల భారం కూడా ఊహించని స్థాయిలో పడిందని తెలుస్తోంది.

 Mahesh Babu Sarkaru Vaari Paata Interest Pressure Details Here Goes Viral , Mahesh Babu , Interest Burden Ranges Rs 30 Crore To Rs 40 Crore , Sarkaru Vaari Paata , Corona Second Wave, Burden Of Interest, Third Wave , Shocking Details , Mytri Producers-వామ్మో.. మహేష్ మూవీపై వడ్డీ భారం అన్ని కోట్లా.. పది కోట్లకు ఎంత కట్టారంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా కోసం మైత్రీ నిర్మాతలు ప్రొద్దుటూరులోని ఫైనాన్షియర్ దగ్గర పది కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారని సమాచారం.ఆ అప్పుకు ఏడు కోట్ల రూపాయలు వడ్డీ అయిందని ఆ మొత్తం తాజాగా చెల్లించారని తెలుస్తోంది.

సర్కారు వారి పాట సినిమాకు నిర్మాతలకు వడ్డీ భారమే 30 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయలు అని బోగట్టా.

కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ను దాటుకుని సర్కారు వారి పాట సినిమా రిలీజ్ కావడంతో సినిమాపై ఈ స్థాయిలో వడ్డీల భారం పడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సర్కారు వారి పాట థియేట్రికల్ హక్కులను మాత్రం తక్కువ మొత్తానికే విక్రయించడం నిర్మాతలకు ప్లస్ అవుతోంది.సర్కారు వారి పాట నిర్మాతలకు నష్టాలను మిగులుస్తుందో లాభాలను మిగులుస్తుందో చూడాల్సి ఉంది.

అయితే సమ్మర్ రిలీజ్ ఈ సినిమాకు కలిసొస్తుందని చెప్పవచ్చు.

సర్కారు వారి పాట భారీస్థాయిలో కలెక్షన్లను సాధించాలని మహేష్ బాబు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సర్కారు వారి పాట సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకున్నా మహేష్ క్రేజ్ పై ప్రభావం చూపదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మహేష్ తర్వాత సినిమాలు త్రివిక్రమ్, రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube