ఫ్యాన్స్‌కు బంపరాఫర్ ఇచ్చిన మహేష్  

Mahesh Babu Sarkaari Vari Paata Fans - Telugu Fans, Mahesh Babu, Sarkaari Vari Paata, Social Media, Twitter

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు.ఇప్పటికే గీతాగోవిందం వంటి బ్లాక్‌బస్టర్ అందించిన డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీ ఉంటుందని మహేష్ తెలుపగా, మే 31న ఈ సినిమా ప్రారంభం ఉండబోతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

 Mahesh Babu Sarkaari Vari Paata Fans

అయితే ఈ సినిమా ప్రారంభోత్సవం ఇప్పట్లో ఉండకపోవచ్చనే వార్త కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ఇక ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన మహేష్, తన కుటుంబంతో గడుపుతున్నాడు.

అయితే అభిమానులతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేందుకు ఇష్టపడని మహేష్, ఇటీవల కాలంలో తన పంథా మార్చుకుని వీలైనప్పుడల్లా వారితో చాట్ చేస్తున్నాడు.కానీ మహేష్ ఎప్పుడు చాట్ చేస్తాడనే విషయం ఫ్యాన్స్‌కు తెలియదు.

ఫ్యాన్స్‌కు బంపరాఫర్ ఇచ్చిన మహేష్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా తాజాగా మే 31న సాయంత్రం 5 గంటలకు తన అభిమానులతో చాట్ చేసేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.వారు మహేష్‌ను ఏదైనా ప్రశ్నలు అగవచ్చని ఆయన తెలిపారు.

ఇది నిజంగా మహేష్ ఫ్యాన్స్‌కు బంపరాఫర్ అని చెప్పాలి.ఇలా ముందే ప్రకటించి తమతో చాట్ చేసేందుకు మహేష్ వస్తుండటంతో వారంతా ఆయన సినిమాల గురించిన పలు సందేహాలను నివృత్తి చేసుకోవాలని చూస్తున్నారు.

ఇక మహేష్-పరశురామ్ కాంబోలో రాబోతున్న సినిమాకు ‘‘సర్కారి వారి పాట’’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.ఈ టైటిల్ లీక్ కావడంపై మహేష్ అండ్ టీమ్ చాలా సీరియస్‌గా ఉన్నారు.

ఇక మహేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో మాట్లాడనున్నట్లు ఆయన తన సోషల్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.మొత్తానికి ఇలా లైవ్ చాట్‌లో మహేష్ తన అభిమానులను పలకరించనుండటంతో రేపు మహేష్ ఫ్యాన్స్ దుమ్ములేపాలని చూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test