100 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్న మహేష్ బాబు...  

Mahesh Babu Sarileru Nikevvaru Movie First Week Worldwide Collections-mahesh Babu Sarileru Nikevvaru,sarileru Nikevvaru,sarileru Nikevvaru Collections,sarileru Nikevvaru Collections Latest News

ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఉ నటించినటువంటి చిత్రం సరిలేరు నీకెవ్వరు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.

Mahesh Babu Sarileru Nikevvaru Movie First Week Worldwide Collections-Mahesh Sarileru Collections Latest News

ఈ చిత్రంలో మహేష్ బాబు కి జోడిగా కన్నడ భామ రష్మిక మందన్న నటించగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ వంటివారు ప్రధాన తారాగణంగా నటించారు.

అయితే ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా 11వ తారీకున తారీకున విడుదలైన ఈ చిత్రం దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.

అంతేగాక ఇటు టాక్ పరంగా కూడా మంచి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

అయితే ఈ చిత్రం విడుదలైన ఈ వారం రోజుల్లోనే దాదాపు గా 103 కోట్లు కొల్లగొట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్నాడు.  ఈ వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో నే దాదాపుగా 85 కోట్ల రూపాయల వచ్చినట్లు ఇప్పటికే అధికారికంగా చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.అయితే కర్ణాటకలో కూడా మహేష్ బాబు తన వసూళ్ల పరంపరను కొనసాగించి దాదాపుగా 6 కోట్ల రూపాయల పై చిలుకు వసూళ్లను సాధించాడు.

అలాగే ఇతర దేశాల్లో కూడా దాదాపుగా 12 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించాడు.అయితే మరోపక్క తమిళనాడులో కూడా దాదాపుగా మూడు కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ లెక్కలు బట్టి చూస్తే విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 105 కోట్ల రూపాయల షేర్ ని సాధించినట్లు తెలుస్తోంది.

అయితే వారంతం సెలవులు కూడా రావడంతో ఈ వసూళ్లు మరింతగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఏదేమైనప్పటికీ ఈ చిత్రంతో మహేష్ బాబు ఉ తన సత్తా ఏంటో టాలీవుడ్ ఇండస్ట్రీకి చూపించాడు.

తాజా వార్తలు

Mahesh Babu Sarileru Nikevvaru Movie First Week Worldwide Collections-mahesh Babu Sarileru Nikevvaru,sarileru Nikevvaru,sarileru Nikevvaru Collections,sarileru Nikevvaru Collections Latest News Related....