మహేష్‌పై మండిపడుతున్న సొంత అభిమానులు

మహేష్‌బాబు మొన్న సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

 Mahesh Babu Reject The Pushpa Movie Script, Mahesh Babu, Sarileru Nikevvaru, Mah-TeluguStop.com

అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మహేష్‌బాబుకు కమర్షియల్‌ హిట్‌ను అయితే ఇచ్చింది.కాని మహేష్‌బాబుకు కొత్త ఇమేజ్‌ను కాని ఆయన నటన పరంగా గొప్పగా చేశాడు అనేలా మాత్రం పేరు తెచ్చి పెట్టలేదు.

ఇక ఇదే సమయంలో మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంను పుష్పకు బదులుగా చేశాడంటూ ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది.

Telugu Anil Ravipudi, Mahesh Babu, Maheshbabu, Tollywood-Movie

మహర్షి చిత్రం విడుదలైన వెంటనే మహేష్‌బాబు సుకుమార్‌ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది.కాని కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరక పోవడంతో సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.దాదాపు ఆరు నెలలు సుకుమార్‌తో చర్చలు జరిపిన మహేష్‌బాబు చివరకు ఆ సినిమా నా వల్ల కాదు బాబు నీవు మరో హీరోను చూసుకో అంటూ తాను కూడా అనీల్‌ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు చేశాడు.

సుకుమార్‌ ఆ ప్రాజెక్ట్‌నే అల్లు అర్జున్‌తో చేసేందుకు సిద్దం అయ్యాడు.

పుష్ప అనే టైటిల్‌తో బన్నీతో సుకుమార్‌ చిత్రం చేయబోతున్నాడు.

తాజాగా బన్నీ పుట్టిన రోజు సందర్బంగా ఫస్ట్‌లుక్‌ వచ్చింది. బన్నీని పుష్ప ఫస్ట్‌లుక్‌లో చూసి అంతా కూడా ఫిదా అవుతున్నారు.

బన్నీ దీంతో మళ్లీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టడం ఖాయం అంటున్నారు.అలాంటి సినిమాను వదులుకోవడం అవివేకం అంటూ మహేష్‌బాబుపై అభిమానులు ఫైర్‌ అవుతున్నారు.

ఎప్పుడు ఒకేలాంటి పాత్రలు ఒకేలాంటి మేకప్‌తో నటించడమేనా.ఇలా ప్రత్యేకంగా ట్రై చేయరా అంటూ మహేష్‌ను సొంత అభిమానులే ప్రశ్నిస్తున్నారు.

మరి మహేష్‌ సమాధానం ఏంటో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube