మహేష్‌ బాబు వెనుక పడ్డట్లేనా?  

Mahesh Babu Sarileru Nikevvaru Latest Update-mahesh Babu

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాకు యావరేజ్‌ టాక్‌ వచ్చింది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని, విజయశాంతి రీ ఎంట్రీతో ఈ చిత్రంకు మంచి పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది అంటూ అంతా అనుకున్నారు.

Mahesh Babu Sarileru Nikevvaru Latest Update-mahesh Babu Telugu Tollywood Movie Cinema Film Latest News Mahesh Babu Sarileru Nikevvaru Latest Update-mahesh-Mahesh Babu Sarileru Nikevvaru Latest Update-Mahesh

అయితే సరిలేరు నీకెవ్వరు చిత్రం వచ్చిన తర్వాత రోజు అల వైకుంఠపురంలో సినిమా వచ్చింది.ఆ సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేసేలా టాక్‌ను దక్కించుకుంది.

ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాను బలంగా ఆ సినిమా ఢీ కొట్టిందంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

ఇటీవలే విడుదలైన అల వైకుంఠపురంలో సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌ దక్కించుకోవడంతో సంక్రాంతి విన్నర్‌ తానే అంటూ తనకు తానుగా ప్రకటించుకోవడం జరిగింది.ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చినా కూడా వారు దాన్ని ప్రమోట్‌ చేసుకోవడంలో విఫలం అయినట్లుగా అనిపిస్తుంది.ఇప్పుడు అంతా కూడా అల వైకుంఠపురంలో చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు.

ఎప్పుడెప్పుడు అల వైకుంఠపురంలో సినిమా చూస్తామా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సంక్రాంతికి ఎవరైనా మంచి సినిమా చూడాలనే అనుకుంటారు.

ఇక సంక్రాంతి విన్నర్‌ అంటూ పబ్లిసిటీ చేస్తే ఇంకా ఏమైనా ఉందా ఖచ్చితంగా ఆ సినిమానే చూడాలని అనుకుంటారు.ఇప్పుడు అదే విషయం అల వైకుంఠపురంలో సినిమాకు కలిసి వస్తుంది.

జనాలు అల వైకుంఠపురంలో సినిమాకు క్యూ కడుతున్నారు.ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అంటూ అంతా త్రివిక్రమ్‌ మూవీ వైపుకు చూస్తున్నారు.

దాంతో సంక్రాంతి రేసులో మహేష్‌బాబు మూవీ వెనుక పడ్డట్లయ్యింది.

తాజా వార్తలు