వరుసగా పదోసారి ఆ ఫీట్ చేసిన బాబు  

Mahesh Babu Sarileru Neekevvaru Touches 1 Million Mark-mahesh Babu,million Dollars,overseas,sarileru Neekevvaru

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు నిన్న ప్రపంచవ్యా్ప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది.మొదట్నుండీ ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్, దాన్ని మెయింటెయిన్ చేస్తూ వచ్చింది.

Mahesh Babu Sarileru Neekevvaru Touches 1 Million Mark-Mahesh Million Dollars Overseas

కాగా సంక్రాంతి సెలవులు కూడా రావడంతో థియేటర్లన్నీ హౌజ్‌ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చాయి.

బెనిఫిట్ షోలకే మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను చేసేందుకు మహేష్ ఫ్యాన్స్‌తో పాటు సాధారన ప్రేక్షకులు ఎగబడ్డారు.

అటు వీకెండ్ కూడా కావడంతో మహేష్ మేనియాతో రెండు తెలుగు రాష్ట్రాలు ఊగిపోయాయి.కాగా ఓవర్సీస్‌లో ఈ మేనియా ఇంకాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి.

ఓవర్సీస్‌లో మహేష్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు.అలాంటిది ఆయన సినిమా రిలీజ్ అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే.

కాగా సరిలేరు నీకెవ్వరు చిత్రానికి అక్కడ కూడా అదిరిపోయే ఆదరణ లభించింది.

సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీమియర్ల ద్వారా 763,000 డాలర్లు కొల్లగొట్టగా తొలిరోజు కలెక్షన్లు(తాజా సమాచారం ప్రకారం) 326,000 డాలర్లుగా లెక్క తేలింది.

దీంతో ఈ సినిమా మొదటి రోజు ముగిసే సరికే మిలియన్ డాలర్ మార్క్‌ను అవలీలగా దాటేసింది.మహేష్ సినిమాలు మిలియన్ మార్క్‌ను దాటడం ఇది వరుసగా పదోసారి.

ఇలాంటి ఫీట్ ఓవర్సీస్‌లో మరే తెలుగు హీరో చేయకపోవడం విశేషం.మహేష్ బాబు మేనియాతో ఆడియెన్స్ నిజంగా సరిలేరు నీకెవ్వరు అంటున్నారు.

తాజా వార్తలు

Mahesh Babu Sarileru Neekevvaru Touches 1 Million Mark-mahesh Babu,million Dollars,overseas,sarileru Neekevvaru Related....