మహేష్ సినిమా కోసం ఎగబడుతున్న ప్రేక్షకులు.. ఎక్కడో తెలుసా?

సూపర్ స్టా్ర్ మహేష్ బాబు సినిమాలంటే యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ కూడా చాలా ఆసక్తిగా చూస్తుంటారు.మహేష్ బాబుకు ఫ్యామిలీ ఆడియెన్సుల్లో కూడా మంచి క్రేజ్ ఉండటంతో ఆయన సినిమాలకు భారీ డిమాండ్ ఉంటుంది.

 Mahesh Babu Sarileru Neekevvaru Hot Cake In Ukraine-TeluguStop.com

ఇక ఓవర్సీస్‌లో మహేష్ సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.టాలీవుడ్‌లోనే మహేష్‌కు ఉన్న ఫాలోయింగ్ అక్కడ మరే హీరోకు ఉండదనేది వాస్తవం.

కాగా మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.తాజాగా అమెరికాలోనే కాకుండా ఉక్రెయిన్‌లో కూడా మహేష్ సినిమాకు గిరాకీ పెరిగిందని, ఇప్పటికే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న 3 ప్రాంతాల్లో టిక్కెట్లు అమ్ముడుపోయాయని చిత్ర నిర్మాత అనిల్ సుంకర తెలిపారు.

 Mahesh Babu Sarileru Neekevvaru Hot Cake In Ukraine-మహేష్ సినిమా కోసం ఎగబడుతున్న ప్రేక్షకులు.. ఎక్కడో తెలుసా-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రిలీజ్‌కు ఇంకా 10 రోజులు ఉండగానే ఇలాంటి ఫీట్ సాధించడంతో మహేష్ స్టామినా ఏమిటో తెలిసిపోతుందని చిత్ర యూనిట్ అంటోన్నారు.

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది.

ఇక ఈ సినిమాతో లేడీ అమితాబ్ విజయశాంతి తెలుగులో రీఎంట్రీ ఇస్తుందనే విషయం తెలిసిందే.సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

#Mahesh Babu #Ukraine #Anil Sunkara #Anil Ravipudi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు