ఆర్ఆర్ఆర్ దెబ్బకు వెనకడుగు వేసిన మహేష్  

Mahesh Babu Movie Effected With RRR Delay, Mahesh Babu, RRR, Rajamouli, NTR, Ram Charan, Lockdown - Telugu Lockdown, Mahesh Babu, Ntr, Rajamouli, Ram Charan, Rrr

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మహేష్, తన నెక్ట్స్ మూవీని కూడా ఇటీవల అనౌన్స్ చేశాడు.

 Mahesh Babu Rrr Rajamouli

దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుండగా, దీనికి ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు.ఇక ఈ సిినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.

అయితే ఎప్పటినుండో దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ ఓ సినిమా చేస్తాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తూ వస్తోంది.కాగా ఇటీవల రాజమౌళి స్వయంగా ఈ మేరకు ప్రకటన కూడా చేశాడు.

ఆర్ఆర్ఆర్ దెబ్బకు వెనకడుగు వేసిన మహేష్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో జక్కన్న-మహేష్ కాంబో ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌పైనే తన ఫోకస్ పూర్తిగా పెట్టడంతో ఈ సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తాడా అని వారు ఎదురుచూస్తున్నారు.

అయితే కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం యావత్ ప్రపంచం అతలాకుతలం అయ్యింది.కరోనా మహమ్మారిని నివారించేందుకు భారత్‌లో ఏకంగా రెండు నెలలకు పైగా లాక్‌డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో సినిమా షూటింగ్‌లు ప్రారంభం అవుతున్నాయి.కానీ తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభన మాత్రం తీవ్ర స్థాయిలో ఉంది.దీంతో టాలీవుడ్ హీరోలు ఎవ్వరు సినిమా షూటింగ్‌లకు హాజరయ్యేందుకు ధైర్యం చేయడం లేదు.

ఈ కారణంగా ఆర్ఆర్ఆర్ హీరోలు సైతం షూటింగ్‌కు రాకపోవడంతో ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతుంది.

దీంతో మహేష్‌తో రాజమౌళి చేయాలనుకున్న ప్రాజెక్టు పట్టాలెక్కడం కూడా మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.ఏదేమైనా ఆర్ఆర్ఆర్ చిత్రం దెబ్బకు మహేష్ సినిమా మరింత వెనక్కి వెళ్లిపోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

మరి రాజమౌళితో మహేష్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతందో చూడాలి.

#Lockdown #Ram Charan #NTR #Rajamouli #RRR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Rrr Rajamouli Related Telugu News,Photos/Pics,Images..