"సైకిల్" ఎక్కుతున్న మహేష్ బాబు

ఇక్కడ సైకిల్ అనగానే ఇదేదో రాజకీయలకి సంబంధించిన విషయం అనుకునేరూ.మహేష్ టీడిపి పార్టీతో చేతులేమి కలపట్లేదు.

 Mahesh Babu Rides Cycle Again-TeluguStop.com

సైకిల్ ఎక్కడం అంటే, మామూలు సైకిల్ ఎక్కడమే, అది తన కొత్త సినిమా కోసం.మరి సైకిల్ ని అంత హైలెట్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే, ఉందండి.

మహేష్ శ్రీమంతుడులో సైకిల్ ఎక్కాడు.ఆ సినిమా ఫలితం ఏంటో, సృష్టించిన రికార్డులేంటో తెలిసిందేగా.

ఇప్పుడు మళ్ళీ మురుగదాస్ సినిమా కోసం సైకిల్ ఎక్కాడు.ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

మహేష్ ఏదో పల్లెటూరిలో సైకిల్ తొక్కుతున్నట్లు సీన్స్ చిత్రీకరిస్తున్నారు.

మరి సినిమాలో మహేష్ పెద్ద ఐబి ఆఫీసర్.

అతను మామూలు సైకిల్ ఎందుకు తొక్కుతున్నాడో అర్థం కావడం లేదు.బహుషా, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయి ఉంటుందేమో!

ఏదైతే ఏం, సైకిల్ సెంటిమెంటు మహేష్ కి మళ్ళీ మేలే చేస్తుందని, శ్రీమంతుడుకి మించిన ఫలితం దక్కుతుందని సూపర్ స్టార్ అభిమానులు ఆశతో ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube