సోషల్‌ లైఫ్‌కు దూరం కావాలంటున్న మహేష్  

Mahesh Babu Requests To Avoid Social Life - Telugu Corona Virus, Mahesh Babu, Social Life, Telugu Movie News

కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.ఈ వైరస్ సోకకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి.

 Mahesh Babu Requests To Avoid Social Life

అటు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కూడా ఈ వైరస్ సోకకుండా తగు చర్యలు తీసుకోవాలని సలహాలు, సూచనలు అందిస్తున్నారు.

టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.

సోషల్‌ లైఫ్‌కు దూరం కావాలంటున్న మహేష్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్స్ కరోనా వైరస్ గురించి అవగాహన కలిగిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరారు.తాజాగా మహేష్ బాబు కూడా ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు సోషల్ లైఫ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

నలుగురిలో జీవించే వారు ప్రస్తుతం ఆ జీవితానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని, అందుకే అందరూ ఇంటికే పరిమితం కావాలని ఆయన కోరారు.అటు ఈ వ్యాధి సోకినవారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని, వారు ఇతరులకు దూరంగా ఉంటే మంచిదని మహేష్ కోరాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Requests To Avoid Social Life Related Telugu News,Photos/Pics,Images..

footer-test