ప్రశాంత్ నీల్ కథని రిజక్ట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు

కేజీఎఫ్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు ప్రశాంత్ నీల్.కేవలం రెండో సినిమాకే ఇండియన్ వైడ్ గా ప్రశాంత్ నీల్ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు.

 Mahesh Babu Rejected Prashanth Neel Story-TeluguStop.com

ఇప్పుడు కేజీఎఫ్ సిరీస్ లో భాగమైన చాప్టర్ 2 రిలీజ్ కి రెడీ అవుతుంది.ఇక కేజీఎఫ్ మూవీ మేకింగ్ విజన్ పై టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మంది ప్రశంసలు కురిపించారు.

హీరోయిజం ఎలివేషన్ అద్బుతంగా చేసాడని కితాబు దక్కించుకున్నాడు.ఈ మూవీతో ఒక్కసారిగా ఇండియన్ వైడ్ పాపులర్ అయిపోయిన ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయడానికి టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు నిర్మాతలు కూడా క్యూ కట్టారు.

 Mahesh Babu Rejected Prashanth Neel Story-ప్రశాంత్ నీల్ కథని రిజక్ట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ మూవీని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.

దీనికంటే ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి ప్రశాంత్ నీల్ ఒక స్క్రిప్ట్ వినిపించాడని టాక్ వినిపిస్తుంది.

అయితే ఈ కథపై మహేష్ బాబు అంత సంతృప్తి చెందలేదని, ఇంకా ఏదైనా బెటర్ సబ్జెక్ట్ ఉంటే సిద్ధం చేయమని ప్రశాంత్ నీల్ సూచించినట్లు ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.దీని తర్వాత సలార్ కథని ప్రభాస్ కి చెప్పి ఒకే చేయించుకొని సెట్స్ పైకి కూడా ప్రశాంత్ నీల్ వెళ్లిపోయాడని టాక్.

Telugu Kgf Chapter 2 Movie, Mahesh Babu, Prashanth Neel Story, Salaar Movie, Tollywood-Movie

ఇక సలార్ తర్వాత ఎన్టీఆర్ తో ప్రశాంత్ సినిమా చేయనున్నాడు.దీని తర్వాత మెగా హీరోలలో ఒకరితో సినిమా ఉంటుందని సమాచారం.ఇలా మహేష్ బాబుతో తెలుగులో మొదటి మూవీ చేసే అవకాశం ప్రశాంత్ నీల్ దక్కించుకోలేకపోయాడు.అయితే కచ్చితంగా వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ వచ్చే అవకాశం ఉందని ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా దానిని నిర్మించడానికి సిద్ధంగా ఉందని ప్రచారంలో ఉంది.

#PrashanthNeel #Mahesh Babu #KGFChapter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు