మహేష్ బాబు( Mahesh Babu ) నుంచి సినిమా వస్తుంది అంటే అభిమానుల్లో క్రేజ్ ఒక రేంజ్ లో ఉంటుంది.చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన మహేష్ బాబు బాల్యంలో ఉండగానే పదికి పైగా సినిమాల్లో లీడ్ రోల్ పోషించాడు.
ఇక హీరో అయ్యాక అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ హీరో అయ్యాడు.అయితే మహేష్ బాబు నటించిన మాక్సిమం సినిమాలు హిట్ అవుతున్నాయి కానీ అతడు రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా హిట్ అయ్యాయి అని మీకు తెలుసా? మరి మహేష్ బాబు రిజెక్ట్ చేసిన ఆ గొప్ప సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

చైల్డ్ ఆర్టిస్టు( Child artist ) నుంచి హీరో అవ్వడానికి ముందు ఎస్ వి కృష్ణారెడ్డి మహేష్ బాబును యమలీల( Yamaleela ) సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నారట.ఈ విషయమే కృష్ణతో చెబితే ఇంకా మహేష్ చిన్నవాడు ఇప్పుడప్పుడే సినిమాలు వద్దు అంటూ చెప్పారట.అలా యమలీల సినిమా మహేష్ బాబు కి మిస్స్ అయ్యింది.ఇక సమంత నాగచైతన్యను స్టార్ కపుల్ గా మార్చిన సినిమా ఏ మాయ చేసావే( Ye Maaya Chesave ).ఈ సినిమా దర్శకుడు గౌతమ్ మీనన్ మొదటగా ఈ సినిమాను మహేష్ బాబు తోనే చేయాలని అనుకున్నారట కానీ కథ కూడా వినక ముందే ఈ సినిమాను రిజెక్ట్ చేశారట మహేష్ బాబు.ఎమ్మెస్ రాజు తన నిర్మాణంలో వచ్చిన మనసంతా నువ్వే సినిమా సైతం మహేష్ బాబు తన తీయాలి అనుకున్న ఏ కారణం చేతనో ఉదయ్ కిరణ్ పెట్టాల్సి వచ్చింది.

ఇక రానా దగ్గుపాటి డబ్ల్యూ సినిమా అయినా లీడర్( Leader ) కు సైతం శేఖర్ కమ్ముల మహేష్ బాబు అయితే బాగుంటుందని అనుకున్న అది వర్కౌట్ అవ్వలేదు.అలాగే హీరో తరుణ్ పరిచయమైన నువ్వే కావాలి సినిమా( Nuvve Kavali Movie ) సైతం మొదట మహేష్ బాబు దగ్గరికి వెళ్లిన చాలా రోజుల పాటు ఓకే చెప్పకుండా నాన్చుతూ ఉండడంతో త్రివిక్రమ్ తరుణ్ తో సినిమా తీసి హిట్టు కొట్టాడు.లీడర్ సినిమా ఎలాగూ ఒప్పుకోలేదు కదా అని ఫిదా సినిమా సైతం శేఖర్ కమ్ముల మహేష్ బాబు తోనే తీయాలనుకున్న ఈ సినిమాను సైతం మహేష్ రిజెక్ట్ చేశాడట.ఇక అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్ గా నేషనల్అవార్డు విన్నర్ గా నిలిపిన సినిమా పుష్పను సైతం సుకుమార్ మొదట మహేష్ బాబుకి చెప్పాడట కానీ మహేష్ ఈ చిత్రం తనకు సరిపడదు అంటూ రిజెక్ట్ చేశాడట.
రవితేజ నటించిన ఇడియట్ పూరి డ్రీం ప్రాజెక్ట్ అయినటువంటి జనగణమన కూడా మహేష్ బాబు చేత రిజెక్ట్ చేయబడ్డ సినిమాలే.సూర్య సినిమాలైన గజిని 24 సినిమాలు సైతం మొదట మహేష్ బాబు దగ్గరికి వచ్చి ఆ తర్వాత సూర్య దగ్గరికి వెళ్ళాయి.
ఇది మాత్రమే కాదు స్నేహితుడు, రుద్రమదేవి, మణిరత్నం వంటి సినిమాలు సైతం మహేష్ బాబు చేయాల్సి ఉండగా అవి కార్యరూపం దాల్చలేదు.