మహేష్‌27 : ఫ్యాన్స్‌ ఎన్నో ఏళ్లుగా ఇలాంటి సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు  

Mahesh Babu Ready To Act Next Movie With Vamshi-mahesh Babu And Anil Ravipudi,mahesh Babu And Vamshi Paidipally,mahesh Babu Maharshi,mahesh Babu Sarileru Nikevvaru

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు విడుదలకు సిద్దం అయ్యింది.సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సరిలేరు నీకెవ్వరుకు అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.

Mahesh Babu Ready To Act Next Movie With Vamshi-mahesh Babu And Anil Ravipudi,mahesh Babu And Vamshi Paidipally,mahesh Babu Maharshi,mahesh Babu Sarileru Nikevvaru Telugu Tollywood Movie Cinema Film L-Mahesh Babu Ready To Act Next Movie With Vamshi-Mahesh And Anil Ravipudi Mahesh Vamshi Paidipally Maharshi Sarileru Nikevvaru

ఈ చిత్రంకు అంతులేని అంచనాలు ఉన్నాయి.ఖచ్చితంగా సరిలేరు నీకెవ్వరు అంటూ మహేష్‌బాబు అనిపించుకోవడం ఖాయం.

ఆ సినిమా సక్సెస్‌ అయిన వెంటనే మహేష్‌బాబు మరో సినిమా కూడా రెడీ అవుతుంది.

మహేష్‌బాబు 25వ చిత్రం మహర్షికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు.

ఆ సినిమా మహేష్‌ కెరీర్‌లో నిలిచిపోయే సినిమా అయ్యింది.అలాంటి సినిమాను చేసినందుకు మహేష్‌ గర్విస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.అలాగే వంశీ మంచి స్నేహితుడిగా మారిపోయాడు.అందుకే వంశీతో మరో సినిమా చేయాలని మహేష్‌బాబు అప్పుడే అనుకున్నాడు.

అయితే ఇంత త్వరగా ఛాన్స్‌ ఇస్తాడని అయితే అనుకోలేదు.తన 27వ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్‌ను వంశీకే మహేష్‌ ఇచ్చాడు.

ఇప్పటికే వంశీ పైడిపల్లి కథను సిద్దం చేసే పనిలో పడ్డాడు.వచ్చే వేసవిలో సినిమాను ప్రారంభించి అదే ఏడాది లేదంటే 2021లో సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అదేంటి అంటే ఈ సినిమాలో మహేష్‌ బాబు గ్యాంగ్‌ స్టర్‌గా విభిన్నమైన నేపథ్యంలో నటించబోతున్నాడు.

బిజినెస్‌మన్‌ చిత్రంలో మహేష్‌బాబు గ్యాంగ్‌స్టర్‌గా కనిపించినా కూడా పూర్తి స్థాయిలో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.రజినీకాంత్‌ కబాలి సినిమాలో ఎలా అయితే కనిపించబోతున్నాడో, బిల్లాలో ప్రభాస్‌ ఎలా అయితే కనిపించాడో అలా ఈసినిమాలో మహేష్‌బాబు కనిపించబోతున్నాడట.

ఇలాంటి పాత్ర మహేష్‌ చేయాలని ఫ్యాన్స్‌ చాలా కాలంగా కోరుకుంటున్నారు.అదే ఇప్పుడు జరుగబోతుంది.

తాజా వార్తలు

Mahesh Babu Ready To Act Next Movie With Vamshi Related....