సర్కారు సినిమాకు రెడీ అవుతున్న మహేష్ !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో సర్కారు వారి పాటసినిమా చేస్తున్నాడు.సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సూపర్ హిట్ కొట్టి అదే జోష్ లో ఈ సినిమా స్టార్ట్ చేసాడు.

 Mahesh Babu Ready For Sarkaru Vaari Paata Second Schedule, Mahesh Babu, Sarkaru-TeluguStop.com

ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరిగింది.ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను డైరెక్టర్ తెరకెక్కించాడు.

అయితే సెకండ్ షెడ్యూల్ కూడా దుబాయ్ లోనే జరుగుతుందని ముందుగా ప్రకటించారు.

కానీ కరోనా కారణంగా దుబాయ్ లో జరగాల్సిన షూటింగ్ హైదరాబాద్ కు షిఫ్ట్ చేసారు.

అలా హైదరాబాద్ లో ప్రారంభం అయినా సెకండ్ షెడ్యూల్ మళ్ళీ కొద్దీ రోజులకే కరోనా కారణంగా వాయిదా పడింది.అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కు చిత్ర యూనిట్ అంత రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే మహేష్ కూడా వాక్సిన్ వేయించుకున్నాడు.

Telugu Keerthy Suresh, Mahesh Babu, Maheshbabu, Sarkaruvaari, Schedule-Movie

ఇప్పుడు చిత్ర యూనిట్ కు కూడా వాక్సిన్ వేయిస్తున్నారట.వాక్సిన్ వేయించడం అయినా తర్వాత ఇక ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్టు టాక్.ఇక ఈ సినిమాలో బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలు గురించి చూపించబోతున్నారని తెలుస్తుంది.

ఈ సినిమా లో విలన్ గా బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ నటిస్తున్నాడు.ఈ సినిమా లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.

Telugu Keerthy Suresh, Mahesh Babu, Maheshbabu, Sarkaruvaari, Schedule-Movie

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా ను వచ్చే సంవత్సరం 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.ఇక ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube