త్రివిక్రమ్ సినిమాలో రా ఏజెంట్ గా సూపర్ స్టార్ మహేష్

త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో మూడో చిత్రం ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే.సర్కారువారి పాట సినిమా కంప్లీట్ అయిన తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాని స్టార్ట్ చేస్తాడు.

 Mahesh Babu Raw Agent In Trivikram Movie-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిపొయింది.మహేష్ బాబు కోసం మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ని త్రివిక్రమ్ రిపీట్ చేస్తున్నాడు.

ఇక పూజా హెగ్డే, నిధి అగర్వాల్ ని హీరోయిన్స్ గా ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా కాన్సెప్ట్ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.

 Mahesh Babu Raw Agent In Trivikram Movie-త్రివిక్రమ్ సినిమాలో రా ఏజెంట్ గా సూపర్ స్టార్ మహేష్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

త్రివిక్రమ్, మహేష్ బాబు కలయికలో వచ్చిన అతడు సినిమాలో ఫ్యామిలీ కథని టచ్ చేశాడు.ఇక ఆ ఎలిమెంట్ భాగా వర్క్ అవుట్ అయ్యింది.

ఇప్పటికి టీవీలలో అతడు సినిమా వస్తే అందరూ ఆసక్తిగా చూస్తారు.తరువాత వీరి కాంబినేషన్ లో దేవుడు, సాయం అనే ఎలిమెంట్స్ ని టచ్ చేశారు.

అయితే ఈ ఎలిమెంట్స్ భాగానే ఉన్న థియేటర్స్ లో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు.ఆ సినిమా ముందు వరకు మహేష్ ని సీరియస్ రోల్స్ లో చూసిన ప్రేక్షకులు ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ లో సూపర్ స్టార్ ని చూడలేకపోయారు.

దీంతో అంతగా వర్క్ కాలేదు.అయినా ఖలేజా మూవీకి కూడా చాలా మంది ఫాన్స్ ఉన్నారు.ఇప్పుడు తెరకెక్కబోయే మూడో సినిమా కోసం దేశభక్తి అనే ఎలిమెంట్ ని త్రివిక్రమ్ మొదటి సారి టచ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.జేమ్స్ బాండ్ తరహాలో మహేష్ బాబుని రా ఏజెంట్ గా ఈ సినిమాలో రిప్రజెంట్ చేసే విధంగా త్రివిక్రమ్ స్క్రిప్ట్ సిద్ధం చేసాడని తెలుస్తుంది.

ఇక రా ఏజెంట్ అయినా కూడా క్యారెక్టరైజేషన్ లో సీరియస్ నెస్ కంటే హ్యూమర్ ఎక్కువగా ఉంటుందని, తన స్టైల్ లోనే ఆ ఏజెంట్ పాత్రని డిజైన్ చేసినట్లు బోగట్టా.సూపర్ స్టార్ మహేష్ బాబుని అభిమానులు కూడా ఎప్పటి నుంచో సీక్రెట్ ఏజెంట్ పాత్రలో చూడాలని అనుకుంటున్నారు.

ఈ సినిమాతో వారందరి కోరిక తీరిపోతుందని టాక్ ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.

#MaheshBabu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు