టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులపై కన్నేశాడు జక్కన్న.
ఈ సినిమాతో తనదైన మార్క్ వేసేందుకు మరోసారి రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమా పూర్తికాక ముందే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి జక్కన్న ఇటీవల ఓపెన్ అయిన విషయం తెలిసిందే.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎప్పటినుండో ఓ సినిమా చేస్తానంటూ చెప్పుకొచ్చిన జక్కన్న, ఇప్పుడు ఆ సినిమాను లైన్లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.ఆర్ఆర్ఆర్ తరువాత తన నెక్ట్స్ మూవీ మహేష్‌తో ఉంటుందని జక్కన్న అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు.
ఇక ఈ ప్రకటనతో మహేష్ ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కానీ అదే సమయంలో వారు చాలా నిరాశకు కూడా లోనవుతున్నారట. రాజమౌళి సినిమా అంటేనే కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.దీంతో మహేష్ రెండేళ్ల పాటు ఒక్క సినిమా కూడా చేయడనే విషయంపై వారు ఆందోళన చెందుతున్నారు.
తమ అభిమాన నటుడు ఇలా రెండేళ్ల పాటు ఒక్క సినిమా కూడా చేయకుండా ఉండటం తాము జీర్ణించుకోలేమని, జక్కన్నతో సినిమా స్టార్ట్ అయ్యేలోపే మరో సినిమాను లైన్లో పెట్టాలని అభిమానులు కోరుతున్నారు.