మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌  

Mahesh Babu Rajamouli Movie Postponed - Telugu Mahesh Babu, Rajamouli, Rrr, Sankranthi, Sarkaru Vaari Paata

మహేష్‌బాబు, రాజమౌళి సినిమా గురించి గత మూడు సంవత్సరాలుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.కేఎల్‌ నారాయణ నిర్మాణంలో మహేష్‌బాబు హీరోగా రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కించాల్సి ఉంది.

 Mahesh Babu Rajamouli Movie Postponed

ఆ సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా రాజమౌళి దాటవేస్తూ వస్తున్నాడు.ఎట్టకేలకు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తర్వాత మహేష్‌బాబుతో సినిమా చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్నాడు.

కొన్ని రోజుల క్రితం రాజమౌళి తన తదుపరి చిత్రం మహేష్‌బాబుతో అంటూ ప్రకటించాడు.

మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌-Movie-Telugu Tollywood Photo Image

రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంను ఈ ఏడాది పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తే వచ్చే ఏడాది చివరి వరకు అయినా మహేష్‌బాబు మూవీని ప్రారంభించే అవకాశం ఉందని అనుకున్నారు.

కాని ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా పూర్తి అయ్యి విడుదల అయ్యేప్పటికి వచ్చే ఏడాది పూర్తి అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మహేష్‌బాబుతో రాజమౌళి సినిమా ప్రారంభంకు 2022 సంవత్సరం చివరి వరకు వెయిట్‌ చేయాల్సి రావచ్చు అంటున్నారు.అప్పటి వరకు సినిమా కోసం వెయిట్‌ చేస్తాడా లేదంటే సర్కారు వారి పాట చిత్రం తర్వాత మరో సినిమాను మహేష్‌బాబు చేస్తాడా అనేది చూడాలి.మహేష్‌ తల్చుకుంటే సర్కారు వారి పాట కాకుండా మరో రెండు సినిమాలను కూడా జక్కన్న సినిమా కంటే ముందు పూర్తి చేయవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

మరి మహేష్‌బాబు ఆలోచన ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Rajamouli Movie Postponed Related Telugu News,Photos/Pics,Images..

footer-test