ఈ  రాజ కుమారుడికి నేటితో సరిగ్గా 21 ఏళ్లు…  

Mahesh babu, Tollywood prince, Rajakumarudu movie news, Rajakumarudu movie completes 21 years, K. Raghavendra Rao - Telugu K Raghavendra Rao, Mahesh Babu, Rajakumarudu Movie Completes 21 Years, Rajakumarudu Movie News, Tollywood Prince

తెలుగులో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు 1999వ సంవత్సరంలో దర్శకత్వం వహించిన “రాజ కుమారుడు” అనే చిత్రం అప్పట్లో బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులని ఎంతగా ఆకట్టుకుందో చెప్పనవసరం లేదు.అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించగా హీరోయిన్ గా బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి ప్రీతీ జింటా నటించింది.

 Mahesh Babu Rajakumarudu Ragavendra Rao

కాగా ఈ చిత్రంలో ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, సీనియర్ నటి సుమలత, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, సూపర్ స్టార్  కృష్ణ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

అయితే ఈ చిత్రం విడుదలై నేటితో సరిగ్గా 21 సంవత్సరాలు కావస్తోంది.

ఈ  రాజ కుమారుడికి నేటితో సరిగ్గా 21 ఏళ్లు…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే అప్పట్లో ఈ చిత్రం  అందుకున్న రికార్డులు మరియు కలెక్షన్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయి.అయితే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మరియు మహేష్ బాబు మామ అల్లుళ్ళ మధ్య సెంటిమెంట్ సన్నివేశాలు ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.

దీంతో ఈ చిత్రం నైజాం సీడెడ్ ఏరియాలలో మంచి వసూళ్లను సాధించదడమే గాక  బీ సి సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది.

దీంతో ప్రస్తుతం కొందరు సినీ సెలబ్రిటీలు మరియు ప్రముఖులు ఈ చిత్రం విడుదలయి నేటితో 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు కె.రాఘవేంద్రరావు కు మరియు చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.మరికొంతమంది మహేష్ బాబు అభిమానులు ఈ చిత్ర పోస్టర్లను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ తెగ ట్రెండింగ్ చేస్తున్నారు.

#Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Rajakumarudu Ragavendra Rao Related Telugu News,Photos/Pics,Images..