ఈగో కాదు ట్యాలెంట్ కావాలంటోన్న మహేష్!  

Mahesh Babu Puts Ego Aside For Thaman - Telugu Mahesh Babu, Parasuram, Sarkaru Vaari Paata, Thaman

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మహేష్ తనదైన మార్క్‌ను వేసుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నాడు.

 Mahesh Babu Puts Ego Aside For Thaman

ఈ సినిమా తరువాత మహేష్ చేయబోయే సినిమా ప్రకటన తాజాగా రావడంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.పరశురామ్ డైరెక్షన్‌లో రాబోయే సినిమాకు సర్కారు వారి పాట అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేయడంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాతో మహేష్ మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో ఈ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ అనుకున్నారు.

ఈగో కాదు ట్యాలెంట్ కావాలంటోన్న మహేష్-Gossips-Telugu Tollywood Photo Image

కానీ సినిమా టైటిల్ చూడగానే ఆ సందేహాలు పటాపంచలు అయ్యాయి.అయితే ఈ సినిమాకు సంగీతం థమన్ అందిస్తుండటంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

గతంలో సరిలేరు నీకెవ్వరు సినిమా సమయంలో ఫేక్ కలెక్షన్స్ అంటూ థమన్ కామెంట్ చేశాడు.దీంతో మహేష్ ఫ్యాన్స్‌లో అతడిపై తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది.

మహేష్ థమన్‌తో ఎప్పటికీ సినిమాలు చేయకపోవచ్చని అందరూ అనుకున్నారు.కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ మహేష్ తన నెక్ట్స్ మూవీకే థమన్‌ను తీసుకున్నాడు.

అందుకు థమన్ అందించిన అల వైకుంఠపురములోని పాటలే అని చెప్పాలి.ఆ సినిమాలోని పాటలు సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతోనే మహేష్ తన నెక్ట్స్ మూవీ కోసం థమన్‌ను తీసుకున్నాడు.

ఏదేమైనా ఈగోలను పక్కనబెట్టి ట్యాలెంట్‌కు మాత్రమే మహేష్ ప్రిఫరెన్స్ ఇవ్వడం నిజంగా గ్రేట్ అంటున్నారు ఆయన ఫ్యాన్స్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Puts Ego Aside For Thaman Related Telugu News,Photos/Pics,Images..

footer-test