మరో రెండు సినిమాలు ప్రకటించే యోచనలో మహేష్‌  

Mahesh Babu Produce Two Movies - Telugu Adivi Sesh, Mahesh Babu, Mahesh Babu To Produce Two Movies, Major, Namrata, Parasuram, Renu Desai, Sharwanand

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నిర్మాతగా మారిన విషయం తెల్సిందే.ఇప్పటి వరకు సొంతంగా సినిమాలు నిర్మించని మహేష్‌బాబు ఇటీవలే అడవి శేషు హీరోగా మేజర్‌ అనే చిత్రాన్ని మొదలు పెట్టాడు.

 Mahesh Babu Produce Two Movies

ఆ చిత్రంలో రేణు దేశాయ్‌ కీలక పాత్రను పోషించే అవకాశాలు ఉన్నాయట.ఇక శర్వానంద్‌ హీరోగా కూడా మహేష్‌బాబు నిర్మాణంలో ఒక సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

రెండు సినిమాలు దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది.ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా మరో రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందట.

మరో రెండు సినిమాలు ప్రకటించే యోచనలో మహేష్‌-Movie-Telugu Tollywood Photo Image

మహేష్‌ బాబు నిర్మాణంలో కోటి లోపు బడ్జెట్‌ చిత్రాలను నిర్మించేందుకు నమ్రత కథా చర్చలు జరుపుతున్నట్లుగా గతంలోనే వార్తలు వచ్చాయి.ఇప్పుడు అందుకు సంబంధించిన రెండు కథలు ఫైనల్‌ అయ్యాయి.

కొత్త దర్శకుడు కొత్త నటీనటులతో ఆ సినిమాలు రూపొందబోతున్నాయట.వీలుంటే ఆ రెండు సినిమాలను థియేటర్లలో లేదంటే ఓటీటీ ద్వారా విడుదల చేయాలని మహేష్‌ బాబు అండ్‌ టీం భావిస్తున్నారు.

డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ మీద సినిమాలకు మరియు వెబ్‌ సిరీస్‌లకు మంచి డిమాండ్‌ ఉన్న కారణంగా మహేష్‌బాబు తన బ్రాండ్‌ ఇమేజ్‌తో నిర్మించి కోట్లు దక్కించుకునే అవకాశం ఉంది.అందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇక మహేష్‌బాబు హీరోగా సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాకు మహేష్‌ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Produce Two Movies Related Telugu News,Photos/Pics,Images..

footer-test