కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించిన మహేష్ బాబు..!  

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీపై కురిపించిన వరాల జల్లుల తో టాలీవుడ్ హీరోలతో పాటు మిగతా అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇండస్ట్రీని ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఎంతో గొప్పగా ఉన్నాయి అంటూ ట్వీట్స్ పెద్ద ఎత్తున చేస్తున్నారు.

TeluguStop.com - Mahesh Babu Praises Telangan Cm Kcr

మరి కొందరు కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖలు కూడా విడుదల చేస్తున్నారు.ఈ విషయంపై ఇదివరకే టాలీవుడ్ సీనియర్ నటులు చిరంజీవి, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ తమ సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సంబంధించి హర్షం వ్యక్తం చేశారు.

తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సీనియర్ హీరోల ను ఫాలో అయ్యాడు.తాజాగా మహేష్ బాబు తెలంగాణ ముఖ్యమంత్రి ని సోషల్ మీడియా వేదికగా చేసుకొని ప్రశంసలతో ముంచెత్తాడు.

TeluguStop.com - కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించిన మహేష్ బాబు..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న సినిమా కార్మికుల కోసం అలాగే సినీ ఇండస్ట్రీని ఆదుకోవడానికి మీరు తీసుకున్న నిర్ణయాలు అద్భుతం సార్ అంటూ కేసీఆర్ ను సపోర్ట్ చేశారు.చివరగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు కేసీఆర్ కు మహేష్ బాబు ధన్యవాదాలు తెలియజేశారు.

ఇక అసలు విషయంలోకి వెళితే.తాజాగా కేసీఆర్ సినీ ఇండస్ట్రీకి సంబంధించి పది కోట్ల లోపు బడ్జెట్ లో ఉన్న సినిమాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధించే జిఎస్టి ను రియంబర్స్మెంట్ ను కల్పించాడు.వీటితోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లలకు సంబంధించి విద్యుత్ కనీస డిమాండ్ చార్జీలను కూడా రద్దు చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు.వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజుకు సంబంధించి షోల సంఖ్యను పెంచేందుకు అనుమతిని జారీ చేశారు.

అలాగే పక్క రాష్ట్రాల్లో కొన్న విధంగా టికెట్ ధరలను సవరించుకునే విధంగా థియేటర్ల యజమానులకు వెసులుబాటు కల్పించారు.ఇలా అనేక రకాల మినహాయింపులతో టాలీవుడ్ ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పెద్దఎత్తున కేసీఆర్ నిర్ణయానికి పొగడ్తలతో టాలీవుడ్ ప్రముఖులు ముంచెత్తుతున్నారు.

#CM KCR #SuperStar #Telangana Cm #@CM_KCR #Thanks

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు