మనల్ని మనం రక్షించుకోవాల్సిందే అంటున్న మహేష్ బాబు! కరోనాపై అవగాహన  

Mahesh Babu Post On Corona Awareness - Telugu Corona Awareness, Corona Effect,, South Cinema, Superstar, Tollywood

దేశంలో కరోనా ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది.కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది.

 Mahesh Babu Post On Corona Awareness

కరోనాని తట్టుకునే శక్తి ఇండియన్ ప్రజలకి ఉందని అందరూ భావించిన కూడా అది అంత తేలికైన విషయం కాదని ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్ధమవుతుంది. లాక్ డౌన్ సమయంలో కరోనా వ్యాప్తి కొంత కంట్రోల్ లో ఉన్న లాక్ డౌన్ సడలింపుల తర్వాత ప్రజల నిర్లక్ష్యం కారణంగా విపరీతంగా వ్యాపించేస్తుంది.

తమకి కరోనా లేదనుకొని పట్టణాల నుంచి సొంత ఊళ్ళకి వెళ్ళిన ప్రజలు అక్కడి వారికి అంటించేస్తున్నారు.దీంతో కాంటాక్ట్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి.

మనల్ని మనం రక్షించుకోవాల్సిందే అంటున్న మహేష్ బాబు కరోనాపై అవగాహన-General-Telugu-Telugu Tollywood Photo Image

దేశంలో కరోనా అంతకంతకు పెరిగిపోతుండడం పట్ల టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు.

లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని తెలిపారు.

ఈ సమయంలో మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా, మన చుట్టూ ఉన్నవాళ్లను కూడా కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు.బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని స్పష్టం చేశారు.

మీ చుట్టుపక్కల పరిస్థితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, భద్రతా చర్యలతో పాటు, భౌతికదూరం కూడా పాటించాలని సూచించారు.మీ ఫోన్ లో ఆరోగ్యసేతు యాప్ లేకపోతే ఇకనైనా డౌన్ లోడ్ చేసుకోవాలని మహేశ్ బాబు పేర్కొన్నారు.

మీకు సమీపంలో ఎవరైనా కరోనా నిర్ధారణ అయిన రోగులు ఉన్నట్టయితే ఈ యాప్ మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది అని మహేశ్ బాబు ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Post On Corona Awareness Related Telugu News,Photos/Pics,Images..

footer-test