మహేష్ బాబు కోసం క్రికెట్ బ్యాగ్రౌండ్ ఎంచుకున్న అనిల్ రావిపూడి

Mahesh Babu Play As A Cricket Coach Role In Anil Ravipudi Film, Tollywood, Trivikram Srinivas, Balakrishna, F3 Movie

టాలెంటెడ్ స్టార్ దర్శకుడుగా బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ సక్సెస్ లతో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. కామెడీ ఎంటర్టైన్మెంట్, యాక్షన్ మిక్స్ చేసి రొటీన్ కమర్షియల్ కథలలని తనదైన శైలిలో తెరపై ఆవిష్కరిస్తూ ప్రేక్షకులకి అనిల్ వినోదాన్ని అందిస్తున్నాడు.

 Mahesh Babu Play As A Cricket Coach Role In Anil Ravipudi Film, Tollywood, Triv-TeluguStop.com

ప్రస్తుతం ఎఫ్2 సీక్వెల్ గా ఎఫ్3 మూవీ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి ఏకంగా ముగ్గురు హీరోలని లైన్ లో పెట్టాడు. రవితేజతో రాజా ది గ్రేట్ సీక్వెల్ కి స్క్రిప్ట్ రెడీ చేసేశాడు.

అలాగే బాలకృష్ణ కోసం ఫన్ అండ్ యాక్షన్ జోనర్ లో మూవీ స్క్రిప్ట్ ఫైనల్ చేశారు.

గోపీచంద్ మలినేని మూవీ తర్వాత అనిల్ రావిపూడితో ఈ సినిమాని సెట్స్ పైకి బాలకృష్ణ తీసుకొని వెళ్తాడు.

అలాగే మరో వైపు సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం స్రిలకప్ట్ లాక్ చేసినట్లు తాజాగా దర్శకుడు అనిల్ రివీల్ చేశారు.త్రివిక్రమ్ మూవీ తర్వాత ఈ మూవీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

అయితే ఈ సినిమాలో మహేష్ బాబు క్రికెట్ కోచ్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తుంది.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లోనే ఫండ్ అండ్ యాక్షన్ జోనర్ లోనే ఈ కాన్సెప్ట్ ని కూడా అనిల్ సిద్ధం చేసాడని సమాచారం.

టాలీవుడ్ లో క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలకి మంచి డిమాండ్ ఉంది.ఈ నేపధ్యంలో మహేష్ బాబుతో ఈ సారి క్రికెట్ పాఠాలు చెప్పించడానికి అనిల్ రెడీ అయినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube