మహేష్‌కు మూడొచ్చింది  

Mahesh Babu Planning To Release Three Movies -

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సంవత్సరానికి ఒక్క సినిమా చొప్పున ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.అయితే తన పద్దతిని మార్చుకోవాలని మహేష్‌బాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత అనుసారం క్రేజ్‌ ఉన్న సమయంలోనే వరుస సినిమాలు చేయాలని ఈయన మదిలో ఆలోచన మెదిలినట్లుగా తెలుస్తోంది.ఆలోచన వచ్చిందే తడువుగా ఈ సూపర్‌ స్టార్‌ వరుసగా సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

Mahesh Babu Planning To Release Three Movies-Telugu Gossips-Telugu Tollywood Photo Image

ఈ సంవత్సరం కనీసం రెండు లేదా మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించుకున్నాడు.

ప్రస్తుతం ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేష్‌బాబు నటిస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా పూర్తి కాగానే శ్రీకాంత్‌ అడ్డాల ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటించనున్నాడు.ఆ సినిమా షూటింగ్‌ ప్రాసెసింగ్‌లో ఉండగానే పూరి జగన్నాధ్‌, అశ్వినీదత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

మేలో ‘శ్రీమంతుడు’ విడుదలకు సిద్దం అవుతుండగా, దసరా లేదా దీపావళికి పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా రాబోతుంది.ఆ తర్వాత ఇదే సంవత్సరం చివర్లో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను విడుదల చేయాలని మహేష్‌ ప్లాన్‌గా తెలుస్తోంది.

మొత్తానికి మహేష్‌కు మూడ్‌ వచ్చి వరుసగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Planning To Release Three Movies Related Telugu News,Photos/Pics,Images..

footer-test