సర్కారు వారి పాట నుండి రేపు కీలక ప్రకటన, ఫ్యాన్స్ హ్యాపీ అవ్వడం పక్క- Mahesh Babu Parashu Ram Movie Sarkaru Vaari Paata Movie Shooting Starts

mahesh babu, parashu ram movie, sarkaru vaari paata movie shooting starts ,Dubai, America, sarkaru vaari paata movie shooting, corona effect, ramoji film city - Telugu America, Corona Effect, Dubai, Keerthi Suresh, Mahesh Babu, Parashu Ram, Parashu Ram Movie, Ramoji Film City, Rashmika Mandana, Sarkaru Vaari Paata Movie Shooting, Sarkaru Vaari Paata Movie Shooting Starts, Sarkaru Vaari Pata

గత ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఈ ఏడాది సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా షూటింగ్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు.

 Mahesh Babu Parashu Ram Movie Sarkaru Vaari Paata Movie Shooting Starts-TeluguStop.com

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను సాధించడం ఖచాం అంటూ ఇప్పటికే సర్కారు వారి పాటపై అంచనాలు ఉన్నాయి.అయితే కరోనా కారణంగా షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతుంది.

ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో అక్కడ కరోనా మరింత ఎక్కువ అయ్యింది.దాంతో అక్కడకు వెళ్లే ప్లానింగ్ ను రద్దు చేసుకున్నారు.
అమెరికా వెళ్లాలనే ఉద్దేశ్యంతో వెయిట్‌ చేస్తున్న యూనిట్‌ సభ్యులకు అక్కడకు ఈమద్య వెళ్లడం సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చారు.అందుకే ఈ సినిమా ను దుబాయిలో చిత్రీకరించాలనే నిర్ణయానికి వచ్చారు.

 Mahesh Babu Parashu Ram Movie Sarkaru Vaari Paata Movie Shooting Starts-సర్కారు వారి పాట నుండి రేపు కీలక ప్రకటన, ఫ్యాన్స్ హ్యాపీ అవ్వడం పక్క-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమెరికాలో ఏదైతే అనుకున్నారో కాస్త చిన్న మార్పులు చేర్పులు చేసి దుబాయిలో షూటింగ్ చేయాలని నిర్ణయించారు.అందుకు సంబంధించి రేపు కీలక ప్రకటన రాబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

దాదాపుగా నాలుగు వారాల పాటు షూటింగ్‌ ను అక్కడ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.రికార్డు స్థాయి బడ్జెట్‌ తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఈ సినిమా యొక్క షూటింగ్ కోసం దుబాయిలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.ఒకటి రెండు రోజుల్లో ఇక్కడ నుండి టీం అక్కడకు వెళ్లే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

ప్రస్తుతం సినిమా షూటింగ్‌ కోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో కూడా సెట్టింగ్ ను వేస్తున్నారు.ఈ సినిమా కోసం థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.

#Dubai #SarkaruVaari #SarkaruVaari #Corona Effect #America

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు