రాజమౌళితో సినిమా కంటే ముందు మహేష్ మరో సినిమా చేయబోతున్నాడు!

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే.ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా రూపొందుతోంది.

 Mahesh Babu One More Film Before Rajamouli Film , Rajamouli Film, Mahesh Babu, R-TeluguStop.com

ఆ సినిమా చిత్రీకరణ రెండవ షెడ్యూల్‌ జరుగుతోంది.ఎప్పుడెప్పుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా మొదలు అవ్వబోతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కానీ ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు.హీరోయిన్‌ గా ఆమె ఎంపిక.

ఈమె ఎంపిక అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని కూడా జక్కన్న టీం మెంబర్స్ అంటున్నారు.ఇక ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది ప్రారంభం అయ్యేది అనుమానమే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఈ సమయంలో కొత్త ప్రచారం ప్రారంభం అయ్యింది.మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న త్రివిక్రమ్‌ సినిమాను జూన్ వరకు పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

Telugu Jakanna, Mahesh Babu, Rajamouli, Telugu-Movie

ఆ తర్వాత వెంటనే మహేష్ బాబు మరో సినిమాను కమిట్‌ అయ్యి నాలుగు అయిదు నెలల్లో ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి దర్శకత్వంలో సినిమా కంటే ముందు మరో సినిమా ను మహేష్ బాబు చేసే అవకాశాలు ఉన్నాయా అంటే ఔను అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. రాజమౌళి తో సినిమా మొదలు అయితే మినిమంగా రెండేళ్ల పాటు డేట్లను మహేష్ బాబు ఇవ్వాల్సి ఉంటుంది.కనుక ఆ లోపు సాధ్యం అయినన్ని ఎక్కువ సినిమాలు చేయాలని మహేష్ బాబు భావిస్తున్నాడట.

రాజమౌళి కూడా అందుకు ఓకే చెప్పాడు అంటున్నారు.అసలు విషయం తెలియాలంటే క్లారిటీ రావాల్సి ఉంది.

మహేష్ బాబు మరియు రాజమౌళి సినిమా కోసం కథ ను సిద్ధం చేస్తున్నట్లుగా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube