మేనల్లుడికి మహేష్‌ బాబు సపోర్ట్‌ లేకపోవడంకు కారణం ఇదేనా?  

Mahesh Babu Not Support Galla Ashok - Telugu Mahesh Babu, , Prince Mahesh Babu, Sri Ram Aditya, Super Star Krishna

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్‌ హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే.రెండేళ్ల క్రితమే గల్లా అశోక్‌ హీరోగా దిల్‌రాజు బ్యానర్‌లో ఒక సినిమా ప్రకటన వచ్చింది.

Mahesh Babu Not Support Galla Ashok

కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.మళ్లీ ఇప్పుడు అశోక్‌ హీరోగా ఒక సినిమా సెట్స్‌ పైకి వెళ్లేందుకు సిద్దం అయ్యింది.

శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతుంది.నిర్మాతగా దిల్‌రాజు తప్పుకోవడంతో స్వయంగా అశోక్‌ తండ్రి అదేనండి మహేష్‌బాబు బావ గారు, ఎంపీ అయిన గల్లా జయదేవ్‌ స్వయంగా నిర్మించేందుకు రంగంలోకి దిగుతున్నాడు.

అశోక్‌ సినీ ఎంట్రీ విషయంలో మహేష్‌బాబు అస్సలు సహకరించడం లేదని, సపోర్ట్‌ చేయడం లేదంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మహేష్‌బాబు కాస్త దృష్టి పెడితే ఎప్పుడో అశోక్‌ సినిమా వచ్చేదని అంటున్నారు.కాని మహేష్‌ బాబు దృష్టి పెట్టక పోవడం వల్లే ఏదో ఒక సినిమా అని శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అయ్యారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది.

మహేష్‌బాబు హీరోగా చేస్తూ కూడా తన కుటుంబ సభ్యులకు మాట సాయం చేయవచ్చు కదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.మహేష్‌ బాబు ఒక్క మాట చెప్తే ఎంతో మంది నిర్మాతలు అది కూడా పెద్ద నిర్మాతలు అశోక్‌ను పరిచయం చేసేందుకు ముందుకు వస్తారు.కాని ఎందుకు మహేష్‌ బాబు ఆ పని చేయలేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.మహేష్‌బాబు తన కుటుంబ సభ్యులకు ఎవరికి సపోర్ట్‌గా నిలవాలని అనుకోవడం లేదట.ఎందుకంటే ఇండస్ట్రీలో వారికి వారు సొంతంగా నిలదొక్కుకుంటే మంచి ఇమేజ్‌ దక్కుతుందని, గౌరవం ఉంటుందని ఆయన భావిస్తున్నాడట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Not Support Galla Ashok-,prince Mahesh Babu,sri Ram Aditya,super Star Krishna Related....