మహేష్‌ అంత ఈజీగా అతడికి దొరుకుతాడా?  

మహేష్‌ బాబుతో సినిమా తీయడం అన్నా చేయడం అన్నా కూడా అంత ఈజీ కాదు అనే విషయం అందరికి తెల్సిందే.ఆయన్ను డైరెక్ట్ చేయడం అంటే చాలా అదృష్టం చేసుకుని ఉండాలి అనడంలో సందేహం లేదు.

TeluguStop.com - Mahesh Babu Next Movie With Anil Ravipudi

వందల మంది దర్శకులు ఉన్న ఈ పరిశ్రమలో ఒక్కరు ఇద్దరికి ఆ అవకాశం వస్తుంది.అలాంటప్పుడు మహేష్‌ ను డైరెక్ట్‌ చేయడం అంటే ఎంత గొప్ప విషయమో అర్థం చేసుకోవచ్చు.

ప్రతి దర్శకుడు కూడా మహేష్‌బాబును డైరెక్ట్‌ చేయాలని కోరుకుంటూ ఉంటాడు.స్టార్‌ దర్శకుల నుండి కొత్త వారి వరకు మహేష్ కోసం కథలు చెప్పేందుకు సిద్దంగా ఉంటారు.

TeluguStop.com - మహేష్‌ అంత ఈజీగా అతడికి దొరుకుతాడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఒక్కసారి మహేష్‌ బాబుతో సినిమా తీస్తే చాలు అని అంతా అనుకుంటూ ఉంటే కొందరు మాత్రం ఆయనతో వరుసగా సినిమాలు తీస్తూ ఉంటారు.ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్‌ బాబు అనీల్‌ రావిపూడికి ఛాన్స్‌ ఇచ్చాడు.

ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మరోసారి అనీల్‌ కు మహేస్‌ డేట్లు ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం మహేష్‌బాబు చేస్తున్న సర్కారు వారి పాట మూవీ ముగిసిన వెంటనే వచ్చే ఏడాది ద్వితీయార్థం ఆరంభంలో మహేష్‌బాబు తన తదుపరి సినిమాను అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్‌బాబుకు ఇప్పటికే అనీల్‌ కథ చెప్పాడట.స్టోరీ లైన్‌ నచ్చడంతో తప్పకుండా చేద్దాం అంటూ హామీ కూడా ఇచ్చాడట.అయితే ఇప్పటి వరకు మహేష్‌బాబుకు అనీల్‌ పూర్తి స్క్రిప్ట్ అయితే చెప్పలేదు.అప్పుడే సినిమా మాత్రం వచ్చే ఏడాది ప్రారంభం 2022 సంక్రాంతికి విడుదల అంటూ చెబుతూ వస్తున్నారు.

మహేష్‌బాబు వంటి సూపర్‌ స్టార్‌ రెండవ సారి కూడా అంత ఈజీగా అనీల్‌ రావిపూడికి దొరికేనా అంటే అనుమానమే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.అనీల్‌ ప్రస్తుతం ఎఫ్‌ 3 సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయ్యి విడుదల అయ్య సక్సెస్‌ అయితే అప్పుడు మహేష్‌ బాబు ఈజీగా దొరికే అవకాశం ఉందంటున్నారు.ఏం జరుగబోతుందో కాలమే నిర్ణయించాలి.

#MaheshBabu #Anil Ravipudi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు