బన్నీ సినిమా నుండి పాఠం నేర్చుకుంటానంటోన్న మహేష్  

Mahesh Babu Next Movie To Go Carefully - Telugu Mahesh Babu, Parasuram, Pushpa, Ssmb27

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 27వ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను అఫీషియల్‌గా మే 31న అనౌన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

 Mahesh Babu Next Movie To Go Carefully

ఇక ఈ సినిమాకు ‘సర్కారి వాటి పాట’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.కాగా ఈ సినిమా నిర్మాణం విషయంలో చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకునేందుకు రెడీ అవుతోంది.

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో షూటింగ్ విషయంలో ఎలాంటి తప్పటడుగుల వేయకూడదని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ చిత్రం షూటింగ్‌ను కేరళలో జరిపేందుకు ప్లాన్ చేశారు.ఈ షెడ్యూల్ కోసం ఏకంగా రూ.3 కోట్లు బడ్జెట్ కేటాయించారు.అయితే ఇప్పుడు ఈ బడ్జెట్ చిత్ర నిర్మాతలకు నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తోంది.దీంతో మహేష్ 27వ చిత్రం విషయంలో ఇలాంటి పొరబాట్లు తలెత్తకుండా చిత్ర యూనిట్ చూడాలనుకుంటోంది.

బన్నీ సినిమా నుండి పాఠం నేర్చుకుంటానంటోన్న మహేష్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఏదేమైనా తన చిత్రానికి సంబంధించి ఎలాంటి విషయంలోనూ తప్పటడుగు వేయకూడదని చిత్ర యూనిట్ ఫిక్స్ అవుతోంది.మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్, నటీనటులు ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test