అదిరే లుక్ తో ఫ్యాన్స్ ను స్టన్ చేస్తున్న మహేష్.. న్యూ పిక్ వైరల్!

సూపర్ స్టార్ మహేష్ బాబు రోజురోజుకూ మరింత యంగ్ లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు.40 సంవత్సరాలు దాటినా ఇప్పటికే లుక్ లో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు.ఎవర్ గ్రీన్ లుక్ తో మహేష్ ఎప్పుడు ఆకట్టుకుంటూ ఉంటాడు.ఇక తాజాగా మహేష్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ఫొటోలో మహేష్ మరింత యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు.

 Mahesh Babu New Look Pic Goes Viral On Social Media,  sarkaru Vaari Paata, Mahe-TeluguStop.com

ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

ఈ ఫోటో ఇప్పటిదా లేదంటే మహేష్ 20 ఏళ్ల నాటిదా అని అందరు కామెంట్స్ చేస్తున్నారు.మహేష్ తాజాగా దిగిన స్టిల్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

తాజాగా మహేష్ ఒక బైక్ మీద సూపర్ స్టైలిష్ కాస్ట్యూమ్స్ తో చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని దిగిన ఫోటో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది.

Telugu Parashuram, Keerthy Suresh, Mahesh Babu, Sarkaruvaari-Movie

ఈ ఫోటో ఎప్పుడు ఎందుకోసం దిగాడో తెలియదు కానీ ఈ ఫోటో మాత్రం మహేష్ మోస్ట్ స్టన్నింగ్స్ లుక్స్ లో చేరిపోయింది.ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలపై ఈ సినిమా తెరకెక్కుతుంది.

Telugu Parashuram, Keerthy Suresh, Mahesh Babu, Sarkaruvaari-Movie

ఈ సినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ నెలలో కానీ.

డిసెంబర్ ఫస్ట్ వీక్ లో కానీ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టనున్నారు.ఇక ఈ సినిమా ఏప్రిల్ 1న విడుదల అవ్వబోతుంది.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నాడు మహేష్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube