బెంగుళూరుకు పాకుతున్న మహేష్ బిజినెస్  

Mahesh Babu Multiplex To Spread To Bengaluru - Telugu Amb Cinemas, Bengaluru, Mahesh Babu, Multiplex, Telugu Movie News

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు అనేక యాడ్స్‌లో బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ను క్రియేట్ చేసుకుంటున్నాడు.ఇక కేవలం యాడ్స్‌లోనే కాకుండా మల్టీప్లెక్ బిజినెస్‌లోకి కూడా అడుగు పెట్టాడు మహేష్.

Mahesh Babu Multiplex To Spread To Bengaluru

ఈ బిజినెస్‌లో మహేష్ తనదైన మార్క్‌తో దూసుకువెళుతున్నాడు.

కాగా ఇప్పుడు ఈ బిజినెస్‌ను ఇతర నగరాలలో కూడా పొడగించాలని చూస్తున్నాడు సూపర్ స్టార్.

తాజాగా కర్ణాటకలోని బెంగుళూరు నగరంలో ఏఎంబీ సినిమాస్‌ను ప్రారంభించాలని మహేష్ భావిస్తున్నాడు.ఐటీ నగరంగా పేరున్న బెంగుళూరులోని కపాలి థియేటర్‌ను దీని కోసం వారు ఎంచుకున్నారు.ఈ థియేటర్‌ను పూర్తిగా రెనోవేట్ చేసి అక్కడ ఏఎంబీ సినిమాస్‌ను ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ఏషియన్ సినిమాస్‌కు చెందిన సునీల్ నారంగ్‌తో కలిసి మహేష్ ఏఎంబీ సినిమాస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ వ్యాపారాన్ని బెంగుళూరులో మొదలుపెట్టేందుకు రెడీ అయిన మహేష్‌కు అక్కడ ఎలాంటి లాభాలు వస్తాయో చూడాలి.

తాజా వార్తలు